ETV Bharat / city

'దేశ వాతావరణ పరిస్థితులకు తగిన టీకా ఎంపిక చేసుకోవడమే ముఖ్యం' - covid vaccine in India

ప్రపంచవ్యాప్తంగా పలు కొవిడ్‌ టీకాలపై ప్రయోగాలు జరుగుతున్నాయని, దేశ వాతావరణ పరిస్థితులకు తగిన దాన్ని ఎంపిక చేసుకోవడమే అత్యంత ముఖ్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు, భారతీయ ప్రజారోగ్య సంస్థ ఛైర్మన్‌ డాక్టర్‌ శ్రీనాథరెడ్డి స్పష్టం చేశారు. అప్పుడే ప్రజలకు నిర్దేశిత ప్రమాణాల ప్రకారం టీకాలను అందించడం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.

corona vaccine in India
టీకా ఎంపిక చేసుకోవడమే ముఖ్యం
author img

By

Published : Dec 4, 2020, 7:03 AM IST

కొవిడ్‌ టీకా వచ్చినంత మాత్రాన అజాగ్రత్తగా ఉండకూడదని, ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాల్సిందేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు, భారతీయ ప్రజారోగ్య సంస్థ ఛైర్మన్‌ డాక్టర్‌ శ్రీనాథరెడ్డి స్పష్టంచేశారు. 2020 ప్రపంచానికి చేదు అనుభవాలను మిగిల్చిందని, కొవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు 2021లో ప్రజలు మరింత క్రమశిక్షణతో వ్యవహరించాల్సిన అవసరముందని తేల్చిచెప్పారు. బ్రిటన్‌లో ప్రజలకు కొవిడ్‌ టీకాను ఇవ్వడానికి అక్కడి ప్రభుత్వం తాజాగా ఆమోదం తెలిపిన నేపథ్యంలో..ప్రపంచ వ్యాప్తంగా టీకాలపై జరుగుతున్న ప్రయోగాలు, వాటి ఫలితాలు, అమలు జరగాల్సిన తీరు తదితరాలను శ్రీనాథరెడ్డి ‘ఈనాడు-ఈటీవీ భారత్’ ముఖాముఖిలో వివరించారు.

కొవిడ్‌ టీకాపై ప్రజల్లో ఆశలు పెరుగుతున్నాయి. వాస్తవానికి ప్రయోగాలు ఏ దశలో ఉన్నాయి?

కొవిడ్‌ టీకాలపై ప్రయోగాలు చాలా వరకు పురోగతి సాధించాయి. అయితే, అన్ని సంస్థలూ తమ వ్యాక్సిన్‌లపై మధ్యంతర ఫలితాలను తప్ప..పూర్తిస్థాయి ఫలితాలను ప్రకటించలేదు. ముఖ్యంగా అతి ముఖ్యమైన మూడోదశ ప్రయోగ ఫలితాలను వెల్లడించలేదు. వీటిని ‘ఔషధ నియంత్రణ సంస్థల’(రెగ్యులేటరీ బాడీస్‌)’కు అందజేయలేదు. ఈ సంస్థలే ప్రయోగాల ఫలితాలను సమగ్రంగా విశ్లేషిస్తాయి. ఆ సమాచారం ఆధారంగా టీకా రక్షణ, సమర్థతపై విశ్వసనీయత ఏర్పడిన తర్వాతే పంపిణీకి ఆమోదముద్ర వేస్తాయి. ఈ కారణంగానే కొన్ని సంస్థలు ఇప్పటికే టీకాలను ఉత్పత్తి చేసినప్పటికీ..ఔషధ నియంత్రణ సంస్థల నుంచి అనుమతి రాకపోవడంతో విపణిలోకి విడుదల చేయలేదు.

టీకా సమర్థతను నిర్ణయించడానికి ఉన్న ప్రామాణికత ఏమిటి?

ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం.. ఏ టీకా అయినా కనీసం 50 శాతానికంటే ఎక్కువ సమర్థతను కనపరచాలి. దాన్ని తీసుకున్న వారిలో ఎంతమందికి వ్యాధి వచ్చింది? తీసుకోని వారిలో ఎంతమందికి సోకింది అనే దాన్ని బట్టి ఈ శాతాన్ని నిర్ధారిస్తారు. ఉదాహరణకు టీకా ఇచ్చిన వారిలో ఐదుగురికి, ఇవ్వని వారిలో 10 మందికి జబ్బు చేసిందనుకోండి. అప్పుడు ఇవ్వని వారితో పోలిస్తే ఇచ్చిన వారిలో 50 శాతం రిస్కు తక్కువగా ఉన్నట్టే కదా! ఇదే ప్రామాణికత. ఇంకోరకంగా చెప్పాలంటే ఒక ప్రయోగాన్ని, ఒకసారే చేసినప్పుడు ఫలితం ఒకే విధంగా ఉంటుంది. అదే ప్రయోగాన్ని వందసార్లు చేసినప్పుడు ఫలితాల శాతంలో మార్పులుంటాయి. ఏ ప్రయోగంలోనైనా విజయాల్లో కనిష్ఠ, గరిష్ఠ స్థాయులను పరిగణనలోకి తీసుకుంటారు. టీకా సమర్థత కనిష్ఠ స్థాయిలో 30 శాతం ఉండొచ్చు. అదే గరిష్ఠ స్థాయిలో 80-90 శాతం కూడా ఉండొచ్చు.

భారీగా టీకాలు పంపిణీ చేయడంలో భారత్‌ ఏ మేరకు సన్నద్ధమైందని భావిస్తున్నారు?

అందుబాటులోకి వచ్చే టీకా, డోసుల సంఖ్యనుబట్టి సన్నద్ధత ఉంటుంది. భారతదేశ వాతావరణ పరిస్థితులకు ఇమిడే టీకాలను ఎంపిక చేసుకోవడం దేశానికి, ప్రజలకు ప్రయోజనకరం. అతి శీతల పరికరాల్లో నిల్వఉంచే టీకాలను సరఫరా చేయడం కష్టంతో కూడుకున్న ప్రక్రియ. 2-8 డిగ్రీలు లేదా గది ఉష్ణోగ్రతలో నిల్వ ఉంచగలిగే వాటి వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. టీకాను రెండు డోసులుగా 3-4 వారాల వ్యవధిలో ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు తగ్గట్లుగా వైద్య సిబ్బంది ఉన్నారా? లేదా? అనేది ముందుగా సరిచూసుకోవాలి. సరిపడా లేకుంటే ఎంబీబీఎస్‌, డెంటల్‌, నర్సింగ్‌ విద్యార్థులను కూడా ఇందులో భాగస్వాములను చేయాలి. వీరికి అవసరమైన శిక్షణ ఇవ్వాలి. టీకా ఇచ్చిన తర్వాత దుష్ఫలితాలు కనిపిస్తే వెంటనే చికిత్స అందించేలా వీరిని తీర్చిదిద్దాలి.

ప్రజలు సాధారణ జీవనం గడపడానికి ఇంకెంత కాలం పట్టొచ్చు?

రానున్న రోజుల్లో వైరస్‌ ఎలా ప్రవర్తిస్తుందనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. ఎంత త్వరగా, వేగంగా టీకాలను అందించగలుగుతాం అనేది కూడా ముఖ్యమే. లక్షిత ప్రజలకు ఇవ్వడానికి నెలల సమయం పట్టొచ్చు. ఈ సమయానికి వైరస్‌ తీవ్రత తగ్గుతుందా? మరింతగా విజృంభిస్తుందా? అనేది ఇప్పుడే అంచనా వేయలేం. టీకాల తాలూకూ మూడో దశ ఫలితాలు వెల్లడైతే తప్ప వాటి సమర్థతా తెలియదు. ఆయా అంశాలపై స్పష్టత వచ్చేవరకూ ప్రజలు స్వీయ రక్షణ చర్యలు తీసుకోవాల్సిందే. అంటే 2021లో కూడా ముఖానికి మాస్కు ధరించడం, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవడం, గుంపుల్లో తిరగకపోవడం, భౌతిక దూరాన్ని పాటించడం వంటివి కొనసాగించాల్సిందే.

ఆక్స్‌ఫర్డ్‌ టీకా ప్రయోగాల్లో కొన్ని పొరపాట్లు చర్చకొచ్చాయి. దీనికి కారణం?

ఆక్స్‌ఫర్డ్‌ టీకా ప్రయోగాల్లో ఒకచోట తెలియకుండానే పొరపాటు జరిగింది. సాధారణంగా ప్రయోగాలకు ఎంపిక చేసుకున్న వాలంటీర్లకు 21 రోజుల వ్యవధిలో రెండు డోసులను సమాన మోతాదులో ఇవ్వాలి. అయితే ఒకచోట 2,800 మందికి మొదటి డోసుగా నిర్దేశించిన మోతాదులో సగమే ఇచ్చారు. 21 రోజుల తర్వాత ఇచ్చే రెండో డోసులో మాత్రం పూర్తిస్థాయిలో ఇచ్చారు. పొరపాటు జరిగినట్టు తర్వాత గుర్తించారు. ఆశ్చర్యంగా పూర్తిగా రెండు డోసులు పొందిన 9 వేల మందితో పోలిస్తే..మొదటి డోసు తక్కువగా పొందిన 2,800 మందికి ఎక్కువ ప్రయోజనం చేకూరినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. రెండు పూర్తిస్థాయి డోసులు తీసుకున్న వారిలో 62 శాతం, మొదటి డోసు తక్కువగా తీసుకున్న వారిలో 90 శాతం ప్రయోజనం కనిపించినట్టు నిర్ధారించారు.

ప్రధానంగా ఏయే టీకాలు రేసులో ముందున్నాయి? వాటిలో సానుకూల, ప్రతికూల అంశాలు ఏమిటి?

ప్రపంచ వ్యాప్తంగా పలు సంస్థలు కరోనా టీకాలపై ప్రయోగాలు జరుపుతున్నాయి. అందులో ప్రధానమైనవి ఆరున్నాయి.

1. ఫైజర్‌ బయో ఎన్‌ టెక్‌
దీన్ని మైనస్‌ 70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంచాలి. తరలింపునకు కూడా ఇదే ఉష్ణోగ్రతను కొనసాగించాల్సి ఉంటుంది. ఈ ఉష్ణోగ్రతతో భారత్‌లో దీన్ని అమల్లోకి తీసుకురావడం కష్టమే.

2. మోడెర్నా

దీన్ని మైనస్‌ 20 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వద్ద నిల్వ ఉంచాల్సి ఉంటుంది. దానికి అనుగుణమైన సదుపాయాలు మన దగ్గర ఉన్నాయి. దేశవ్యాప్తంగా అందించడానికి మాత్రం మరికొన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.

3. స్పుత్నిక్‌-వి

ఈ రష్యా తయారీ టీకాను మామూలు రిఫ్రిజిరేటర్‌ ఉష్ణోగ్రతలో నిల్వచేయొచ్చు. దీని సమర్థత గురించి పూర్తి సమాచారం మనకింకా రాలేదు. మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ మొదలుపెట్టకముందే రష్యాలోని సైనికులకు, కొంతమందికి అత్యవసర వినియోగం కింద దీన్ని పంపిణీ చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ పచ్చజెండా ఊపితే తక్కువ ధరకే ఇది మనకు లభిస్తుంది. దీన్ని భారత్‌లో రెడ్డీస్‌ ల్యాబ్స్‌ తయారుచేస్తోంది.

4. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం, ఆస్ట్రాజెనెకా

ఇది కూడా మూడో ప్రయోగ దశలోనే ఉంది. ప్రయోగాలన్నీ ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. పుణెలోని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ దేశంలో దీన్ని ఉత్పత్తి చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ 30 లక్షల డోసులను ఉత్పత్తి చేయడానికి సిద్ధమైంది.

5. భారత్‌ బయోటెక్‌, ఐసీఎంఆర్‌

మన దేశంలో ఉత్పత్తికి ప్రయోగాలు నిర్వహిస్తున్న ఏకైక కరోనా(కొవాగ్జిన్‌) టీకా ఇది. దీని మూడోదశ ప్రయోగాలు కొనసాగుతున్నాయి. ఫలితాలు ఇంకా వెలుగుచూడలేదు.

6. జైడస్‌ క్యాడిలా..

ఈ టీకా గురించిన సమాచారం ఇంతవరకూ బయటకు రాలేదు.

టీకా ముందుగా ఎవరికిస్తే బాగుంటుంది?

టీకాలు ముందుగా ఎవరికివ్వాలనే ప్రశ్న తలెత్తినప్పుడు మొదటి వరుసలో ఉండేవారు వైద్యసిబ్బందే. తర్వాత స్థానంలో పారిశుద్ధ్య కార్మికులు, భద్రత, రవాణా సిబ్బంది, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు ఉంటారు. టీకాల లభ్యతను బట్టి కూడా వీరిలో ఎవరికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలనేది ఆధారపడి ఉంటుంది. పరిమిత సంఖ్యలో లభ్యమైతే మాత్రం ముందుగా వృద్ధులకు ప్రాధాన్యమిచ్చి, తర్వాత దశల్లో యువతకు ఇవ్వాలి. అలాగే దీర్ఘకాలిక రోగులు, కాలుష్యం తీవ్రత ప్రభావం, జనసాంద్రత అధికంగా ఉన్న పట్టణాల్లో ముందుగా టీకా వేసే కార్యక్రమం మొదలుపెట్టాలి. ఆ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకొని చిన్న పట్టణాలకు, గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.