ఈ బతుకమ్మ, దసరా పండుగలకు బట్టలు, చెప్పులు అంటూ.. పాషింగ్ అవకాశాలు(festival shopping) చాలా ఎక్కువ. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్ని వ్యాపార సంస్థలు ఉవ్విళ్లూరుతుంటాయి. అందుకు తగ్గట్టుగా తీవ్ర కృషి చేస్తుంటాయి. క్రియేటివ్ ప్రకటనలు(shopping ads), మార్కెటింగ్ స్ట్రాటజీల(advertisement ideas)తో జనాల్లోకి దూసుకెళ్లి.. వ్యాపార లాభాలు పొందేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తుంటాయి. ఎలా అయితే వినియోగదారులు ఆకర్షితులవుతారు..? అనే దానిపై మథనం(advertisement ideas) చేస్తారు. రకరకాల కాన్సెప్టులతో తయారు చేసిన పోస్టర్లు, వీడియోలు, గ్రాఫిక్స్(shopping ads)లను సామాజికమాధ్యమాల్లో విడుదల చేస్తారు. ఇదే సమయంలో.. ఓ చెప్పుల తయారీ సంస్థ చేసిన ప్రయోగం(advertisement poster design).. జనాల్లోకి అయితే పోయింది. కానీ.. లాభాలు వెనకేసుకోవాల్సిన సంస్థ కాస్తా.. వాళ్ల తిట్లదండకాలను మూటలు కట్టుకుంటోంది. నెటిజన్ల ఆగ్రహం చవిచూస్తోంది.
అసలు అందులో ఏముందంటే..
చెప్పులు కొందామని ఇంటర్నెట్లో వెతకగా.. సదరు కంపెనీ యాడ్ కనిపించింది. ఎంటా ఆ యాడ్ అని ఓపెన్ చేసి చూస్తే.. చెప్పులు కొందామన్న ఉత్సాహం సంగతి అటుంచితే.. ఆ యాడ్ కింద చెప్పుకోలేని మాటలతో కామెంట్లు రాసుకొచ్చే పరిస్థితి ఏర్పడింది. దసరా పండుగ సందర్భంగా జనాలు ఆడుకునే దాండియా కాన్సెప్ట్‌తో రెండు పోస్టర్లను సంస్థ తయారు చేసింది. అయితే ఇందులో ఒకటి అమ్మాయిది, ఇంకోటి అబ్బాయిది. కాగా.. ఈ రెండు పోస్టర్లలో వాళ్లు దాండియా ఆడుతూ కన్పిస్తారు. ఇందులో వివాదమేముంది అనుకుంటున్నారా..? ఇద్దరితో ఆడుతున్న ఎదుటి భాగస్వామి మనిషి కాకపోవటమే ఇక్కడ అసలు సమస్యకు కారణమైంది. అమ్మాయేమో.. అబ్బాయిలు వేసుకునే స్యాండిల్తో.. అబ్బాయేమో అమ్మాయి వేసుకునే హైహీల్స్‌తో దాండియా ఆడుతున్నారు. సంప్రదాయానికి సంబంధించిన ఓ ఆటను చెప్పులతో ఆడించటం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. అందులో ఉన్న అమ్మాయి, అబ్బాయిలు వేసుకున్న చెప్పులను హైలెట్ చేస్తూ.. మార్కెటింగ్ చేసుకోవాలి. కానీ.. ఏకంగా చెప్పులతో ఆటను ఆడిస్తూ.. డిజైన్ చేయటమనేది.. దాండియాను కించపరచటమే అంటూ.. అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసులకు ఫిర్యాదు..
పండుగను సొమ్ము చేసుకునే క్రమంలో.. హిందువుల మనోభావాలను దెబ్బతిస్తున్నారంటూ.. ఆ యాడ్ చూసిన జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు సంస్థ నిర్వాహకులపై కర్మాన్‌ఘాట్‌కు చెందిన న్యాయవాది ప్రదీప్.. సరూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా చెప్పుతో మహిళ దాండియా ఆడుతున్నట్లు పోస్టర్ రూపొందించిన సంస్థ నిర్వాహకులు, డిజైనర్‌పై చర్యలు చేపట్టాలని అడ్వకేట్ ప్రదీప్ కుమార్ డిమాండ్ చేశారు. ఫిర్యాదుపై విచారించి చట్టపరమైన చర్యలు చేపడతామని సీఐ సీతారాం తెలిపారు. అటు సామాజిక మాధ్యమాల్లోనూ.. నెటిజన్లు తిట్ల దండకాలు అందుకుంటున్నారు.
ఇదీ చూడండి: