ETV Bharat / city

పాతబస్తీ వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం

వరదలతో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు ఐదురుగు సభ్యులతో కూడిన కేంద్ర బృందం హైదరాబాద్​ పాతబస్తీలో పర్యటిస్తోంది. ముంపుప్రాంతాల్లో జరిగిన నష్టం వివరాలన సేకరించనున్నారు. రెండు రోజుల పర్యటన అనంతరం.. కేంద్రానికి నివేదిక సమర్పించనుంది.

central-team-visited-flood-effected-areas-in-hyderabad
పాతబస్తీలో వరద నష్టాన్ని పరిశీలిస్తున్న కేంద్ర బృందం
author img

By

Published : Oct 22, 2020, 3:32 PM IST

Updated : Oct 22, 2020, 4:26 PM IST

రాష్ట్రంలో వరదలపై నష్టాన్ని అంచనా వేసేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వారు గురువారం నుంచి రెండు రోజులపాటు తెలంగాణవ్యాప్తంగా పర్యటించనున్నారు. అందులో భాగంగా పాతబస్తీలోని ఫలక్​నుమా ఓవర్​ బ్రిడ్జి, అల్​జుబైల్ కాలనీ, గాజి మిల్లత్​ కాలనీ, హాఫెజ్​ బాబానగర్​, చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఫ‌ల‌క్‌నూమా వద్ద దెబ్బతిన్న రైల్వే ఓవర్​ బ్రిడ్జి(ఆర్వోబీ)ని, ముంపునకు గురైన ప్రాంతాన్ని కేంద్ర బృందం పరిశీలించింది. వరద బాధిత ప్రజలతో మాట్లాడిన కేంద్ర బృందం టీం లీడర్ ప్రవీణ్ వశిష్ఠ, అధికారులు ఎం.రఘురామ్, ఎస్ కె కుష్వారా కలిసి ఆర్వోబీ రెండు వైపుల చేప‌ట్టిన‌ పునరుద్ధరణ, నాలా నుంచి తొలగిస్తున్న పూడిక తీత పనులను పరిశీలించారు.

నష్టాన్ని వివరిస్తున్న ఎంపీ అసద్

ముంపు ప్రాంతాల్లో వరద ఏ విధంగా వచ్చింది? నష్టం ఎంతమేర వాటిల్లింది? తదితర అంశాలను హైదరాబాద్​ ఎంపీ అసదుద్దీన్​ ఓవైసీ కేంద్ర బృందానికి వివరిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టం ప్రస్తుత పరిస్థి తదితర అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు. 40 సంవత్సరాల క్రితం ఫలక్​నుమా ఆర్వోబీని నిర్మించినట్లు జీహెచ్​ఎంసీ కమిషనర్​ లోకేష్​కుమార్​ వివరించారు. రైల్వే ఓవర్​ బ్రిడ్జి(ఆర్వోబీ) రిటైనింగ్​ వాల్వ్​ దెబ్బతినడం వల్ల అనేక కాలనీలు వరద ముంపునకు గురైనట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కాలనీల్లో రోడ్లపైకి 5 మీటర్ల ఎత్తున వరద నీరు నిలిచినట్లు కేంద్ర బృందానికి వివరించారు.

రెండు రోజుల పర్యటన

కేంద్ర ప్రభుత్వం నుంచి తక్షణ సాయంగా రూ. 1,350 కోట్ల విడుదల చేయాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి.. సీఎం కేసీఆర్ ఇటీవల లేఖ రాశారు. దీనిపై స్పందించిన కేంద్రం.. వరద నష్టం అంచనా కోసం వచ్చిన ఐదుగురు సభ్యుల బృందాన్ని రాష్ట్రానికి పంపింది. వీరు రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించి.. కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నారు.

ఇదీ చదవండిః వరద నష్టం పరిశీలనకు కేంద్ర బృందం రాక

Last Updated : Oct 22, 2020, 4:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.