తెలంగాణ కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయిందని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ తెలంగాణను అసదుద్దీన్ ఓవైసీకి దాసోహం చేశారని విమర్శించారు. కిషన్ రెడ్డి చేపట్టిన జన ఆశీర్వాద యాత్ర ఉప్పల్‌కు చేరుకోవడంతో... భాజపా శ్రేణులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికాయి. ఉప్పల్ వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన కిషన్ రెడ్డి... స్వాతంత్య్రం వచ్చిన తరువాత తొలిసారి కేంద్ర మంత్రివర్గంలో 80 శాతం బడుగు బలహీన వర్గాలకు అవకాశం కల్పించారని తెలిపారు.
కేంద్ర మంత్రి వర్గ విస్తరణ తరువాత కొత్త మంత్రులను సభకు పరిచయం చేస్తుంటే కాంగ్రెస్ అడ్డుకుందని మండిపడ్డారు. 130 కోట్ల ప్రజల ప్రాణాలను కాపాడేందుకు తయారీ చేసిన వ్యాక్సిన్ చివరి వ్యక్తి వరకు అందిస్తామని స్పష్టం చేశారు. 32 ఏళ్ల తరువాత నరేంద్ర మోదీ నూతన విద్యా విధానం తీసుకువచ్చారని గుర్తు చేశారు.
పేదలకు ఉచితంగా కార్పొరేటర్ వైద్యం అందించేందుకు మోదీ ఆయుషుమాన్ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నరేంద్రమోదీకి పేరు వస్తుందనే ఉద్దేశంతో తెలంగాణలో ఈ పథకాన్ని అమలు చేయడం లేదు. ఏడేళ్ల కేసీఆర్ పాలనలో ఒక్కసారి కూడా సచివాలయానికి రాలేదు.
-కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి
ఇదీ చదవండి: KISHAN REDDY: ఉచిత రేషన్ బియ్యం పంపిణీ అమలుపై ఆరా