హైదరాబాద్‌లో తెరాస ఎలాంటి అభివృద్ది చేయలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. తెరాస నేతలను ప్రజలు నిలదీయాలని అన్నారు. అంబర్‌పేట నియోజకవర్గంలో... చివరి రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. భాజపాను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.
తెలంగాణలో సచివాలయం లేకుండా చేసిన ఏకైక ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అని... కొడుకు ముఖ్యమంత్రి కావాలంటే వాస్తు బాగోలేదని కూల్చారని ఎద్దేవా చేసారు. పీవీ ఘాట్, ఎన్టీఆర్ ఘాట్ కూల్చేస్తామని ఎంఐఎం వాళ్ళు అంటుంటే... సీఎం కేసీఆర్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.
ఇదీ చూడండి: భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు చేసిన అమిత్ షా