రాష్ట్రంలో కుటుంబ పాలన పోవాలి... భాజపా ప్రభుత్వం రావాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో భాజపా కార్యకర్తలతో కిషన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అధికారులే చెప్తున్నారన్న కిషన్‌రెడ్డి... ఆ మార్పు భాజపాకే అనుకూలంగా ఉందని స్పష్టం చేశారు.
గ్రేటర్‌లో ఓడిన అభ్యర్థులతో మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవాలు చేయిస్తున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు. రానున్న రెండేళ్లు భాజపాకు అత్యంత కీలకమని సూచించారు. పోరుగడ్డ వరంగల్ మేయర్ పీఠాన్ని భాజపా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ రింగ్ రోడ్డుకు సగం నిధులను కేంద్రం ఇచ్చిందని వివరించారు. నాగార్జునసాగర్‌లో భాజపా జెండా ఎగరాల్సిన అవసరం ఉందని కార్యకర్తలకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సూచించారు.