ETV Bharat / city

ట్రేసింగ్.. టెస్టింగ్​.. ట్రీటింగ్​తో అరికడదాం: కిషన్ రెడ్డి - కిషన్ రెడ్డి టిమ్స్ సందర్శన

హైదరాబాద్​ గచ్చిబౌలిలోని టిమ్స్ ఆసుపత్రిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డి సందర్శించారు. రాష్ట్రంలో కరోనా పరీక్షలు తక్కువగా చేస్తున్నారని, పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

central home union minister kishan reddy visit tims in gachibowli
ట్రేసింగ్ టెస్టింగ్​ ట్రీటింగ్​తో అరికడదాం: కిషన్ రెడ్డి
author img

By

Published : Aug 1, 2020, 10:57 AM IST

Updated : Aug 1, 2020, 11:38 AM IST

ట్రేసింగ్ టెస్టింగ్ ట్రీటింగ్​ ద్వారా కరోనాను అరికడదామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డి అన్నారు. ఇవాళ గచ్చిబౌలిలోని టిమ్స్ ఆసుపత్రిని ఆయన సందర్శించారు. టిమ్స్​లో వెయ్యిమందికి చికిత్స అందించేలా సిబ్బందిని తీసుకోవాలని సూచించారు. తెలంగాణకు అన్ని రకాలుగా సహకరిస్తున్న కేంద్రం... రాష్ట్రానికి 1,200 వెంటిలేటర్లు పంపినట్టు తెలిపారు. రాష్ట్రానికి అవసరమైన పీపీఈ కిట్లు, వెంటిలేటర్లు పూర్తిస్థాయిలో పంపేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు.

త్వరలో ఈఎస్​ఐ ఆసుపత్రిలో కొవిడ్ పడకలు ఏర్పాటు చేయనున్నట్టు కిషన్ రెడ్డి వెల్లడించారు. అన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్​ సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. ఆగస్టు నెలంతా జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. హైదరాబాద్​లో పరీక్షల సంఖ్య తక్కువగా ఉందన్న ఆయన... అన్ని బస్తీల్లో పరీక్షలు చేయాలన్నారు. పరీక్షల సంఖ్య ఎంత పెంచితే... కరోనాను అంతగా అరికట్టవచ్చన్నారు. మాస్కులు లేకుండా బయటకు రావొద్దని అందరికీ విజ్ఞప్తి చేశారు. 65 ఏళ్లు పైబడినవారు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు బయటకు రావొద్దని కోరారు.

కరోనా విషయంలో అధికార యంత్రాంగం మరింత సమర్థంగా పనిచేయాలని కిషన్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులపై విశ్వాసం లేకనే ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారని వ్యాఖ్యానించారు. అధికంగా వసూళ్లకు పాల్పడుతున్న ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి... అప్పుల పాలు కావొద్దని ప్రజలకు సూచించారు. పారిశుద్ధ్య కార్మికులు, వైద్యులు, పారామెడికల్ సిబ్బందికి ప్రోత్సాహకాలు పెంచి, ఆదుకోవాలన్నారు.

ట్రేసింగ్.. టెస్టింగ్​.. ట్రీటింగ్​తో అరికడదాం: కిషన్ రెడ్డి

ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 2,083 కరోనా పాజిటివ్​ కేసులు

Last Updated : Aug 1, 2020, 11:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.