ETV Bharat / city

'కార్మికులారా... మీ వెనుక మేమున్నాం'

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే... సకల ఉద్యోగుల సమ్మె అనివార్యంగా కనిపిస్తోందని తెలంగాణ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దానకర్ణచారి తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఆయన మద్దతు ప్రకటించారు.

ఆర్టీసీ సమ్మెకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మద్దతు
author img

By

Published : Oct 17, 2019, 9:13 AM IST

ఆర్టీసీ సమ్మెకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మద్దతు

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తెలంగాణ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మద్దతు ప్రకటించారు. సమ్మె చేయడం కార్మికుల ప్రాథమిక హక్కు అని వాటిని ప్రభుత్వాలు కాలరాయడం సరైంది కాదని ఆ సంఘం అధ్యక్షుడు దానకర్ణచారి అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబర్ నెల వేతనాన్ని వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగులు కీలకంగా వ్యవహరించారని గుర్తుచేశారు. కార్మికులెవరూ అధైర్యపడొద్దని, వారి వెనుక ఉద్యోగులంతా ఉన్నారని ఆయన భరోసా కల్పించారు.

Intro:ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె కు క్రమంగా మద్దతు పెరుగుతూ వస్తుంది... తెలంగాణ కేంద్ర ప్రభుత్వ మరియు కేంద్ర ప్రభుత్వ పబ్లిక్ సెక్టార్సు ఉద్యోగులు తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు సంగం అధ్యక్షులు వి. దానకర్ణ చారి తెలిపారు....
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకపోతే సకల ఉద్యోగుల సమ్మె అనివార్యంగా కనిపిస్తుందని తెలంగాణ కేంద్ర ప్రభుత్వ మరియు కేంద్ర ప్రభుత్వ పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులుతెలిపారు.. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను డిమాండ్లను పరిష్కరించాలని బుధవారం కాచిగూడ లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన BDL, HAL, BHEL, ODF, Postal, DLRL, DRDL మొదలగు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు పాల్గొన్నారు..
సమ్మె చేయడం కార్మికులకు ప్రాథమిక హక్కు అని వాటిని ప్రభుత్వాలు కాలరాయడం సరైంది కాదని ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబర్ నెల వేతనాన్ని వెంటనే మంజూరు చేయాలని సమావేశంలో డిమాండ్ చేశారు.. తెలంగాణ ఉద్యమంలో ఏ కార్యక్రమమైనా ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర ఎంతో ఉన్నదని తెలిపారు ..ఆర్టీసీ కార్మికులు ఎవరు అధైర్యపడొద్దు ధైర్యంగా నిలబడాలి మీ వెనుక ఉద్యోగులంతా ఉన్నారని తెలిపారు..
సమావేశానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘ నాయకులు రామ్ మూర్తి , రవి కుమార్ ముదిరాజ్, ప్రజాపతి రాజేష్, రాజయ్య , రామరాజు ,బాల నరసింహులు, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు
బైట్: వి దానకర్ణ చారి (తెలంగాణ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘ నాయకులు)

Body:విజేందర్ అంబరుపేట

Conclusion:8555855674
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.