పోలవరం ప్రాజెక్టు పనులు వచ్చే ఏడాది ఏప్రిల్‌కు పూర్తవుతాయని కేంద్రం స్పష్టం చేసింది. తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు.. కేంద్రమంత్రి కటారియా రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. పీపీఏ సవరించిన షెడ్యూల్ మేరకు వివరాలు ఇస్తున్నామని తెలిపారు.
పోలవరం స్పిల్ వే పనులు మే నాటికి పూర్తవుతాయని కేంద్రమంత్రి కటారియా వెల్లడించారు. ఏప్రిల్ నాటికి క్రస్ట్ గేట్ల ఏర్పాటు పూర్తవుతుందని స్పష్టం చేశారు. పోలవరం కాఫర్ డ్యాం నిర్మాణం జూన్‌కల్లా పూర్తవుతుందన్నారు. ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్, కుడి, ఎడమ కాల్వలు 2022 ఏప్రిల్‌కు పూర్తవుతుందని వెల్లడించారు. భూసేకరణ, పునరావాస పనులు 2022 ఏప్రిల్‌కే అవుతాయని కటారియా వెల్లడించారు.
ఇదీ చదవండి: నయీం కేసులో తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశం