విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం దిశగా కేంద్రం మరో అడుగేసింది. స్టీల్ ప్లాంట్, అనుబంధ సంస్థలన్నీ వందశాతం విక్రయిస్తున్నట్లు మరోసారి స్పష్టం చేసింది. దీంతో ఏపీలోని జగ్గయ్యపేట, తెలంగాణలోని మాదారం స్టీల్ గనులను సైతం అమ్మేస్తున్నట్లు వెల్లడించింది.
ఈ మేరకు కన్సల్టెంట్ నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేసింది. బిడ్ దాఖలు చేసేందుకు ఈనెల 28 చివరి తేదీగా ప్రకటించింది. 29న సాంకేతిక బిడ్ తెరుస్తారని పేర్కొంది.
ఇదీచూడండి: Union Cabinet: మోదీ ప్రభుత్వంలో మంత్రులు- వారి శాఖలు