18 రాష్ట్రాల్లో సభ్యులను కలిగిన రాతెస తన ఐదో వార్షికోత్సవాన్ని జూన్ 28న ఆన్లైన్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 వరకు జరుపుకోనుంది. భాషాభిమానులందరూ లింక్ https://forms.gle/oiygygxV1hmDm3j37 ద్వారా నమోదు చేసుకుని పాల్గొనాలని సూచించారు. కరోనాపై అంతర్జాతీయ కవి సమ్మేళంలో ఆసక్తి గల కవులు పాల్గొనవచ్చని ఆ సంఘం అధ్యక్షులు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల వెలుపల నివసిస్తున్న తెలుగు వారిని, తెలుగు సంస్థలను ఏకతాటిపై తీసుకురావాలనే లక్ష్యంతో రాష్ట్రేతర తెలుగు సమాఖ్యను 2015లో స్థాపించారు. తెలుగు ప్రముఖుల సందేశాలు, తొమ్మిది రంగాల విశిష్ట కళాకారుల ప్రదర్శనలు, అంతర్జాతీయ కవి సమ్మేళనం అంశాలుగా ఉంటాయి. ఆసక్తి గలవారు వివరాలకు వెబ్సైట్ https://rashtretaratelugusamakhya.com/ చూడవచ్చని వివరించారు.
ఇదీ చూడండి : '33 శాతం అడవులు పెంపొందించడమే సీఎం లక్ష్యం'