ETV Bharat / city

డాక్టర్​ సుధాకర్ కేసు... దర్యాప్తు పురోగతిపై సీబీఐ నివేదిక - ఏపీ హైకోర్టు వార్తలు

ఏపీలోని నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు సుధాకర్ కేసులో దర్యాప్తు పురోగతిని సీల్డ్ కవర్​లో రెండో స్థాయి నివేదికను సమర్పించినట్లు ఏపీ హైకోర్టుకు సీబీఐ తెలిపింది. కేసు సున్నితత్వం వల్ల దర్యాప్తు వివరాల్ని బహిర్గతం చేయలేమని సీబీఐ తెలిపింది. ఈ కేసు విచారణను ఆంధ్రప్రదేశ్​ హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది.

ఏపీ: డాక్టర్​ సుధాకర్ కేసు....దర్యాప్తు పురోగతిపై సీబీఐ నివేదిక

author img

By

Published : Nov 18, 2020, 9:41 AM IST

ఏపీలోని విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి మత్తు వైద్యుడు సుధాకర్ కేసులో దర్యాప్తు పురోగతిని తెలియజేస్తూ సీల్డ్ కవర్​లో రెండో స్థాయి నివేదికను సమర్పించినట్లు హైకోర్టుకు సీబీఐ తెలిపింది. కేసు సున్నితత్వం వల్ల దర్యాప్తు వివరాల్ని బహిర్గతం చేయలేమని పేర్కొంది. సీబీఐ దాఖలు చేసిన నివేదిక కేసు ఫైల్​లో చేరకపోవడంతో విచారణ నేటికి వాయిదా పడింది. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.కుమార్, జస్టిస్ ఉమాదేవితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

విశాఖ పోలీసులు డాక్టర్ సుధాకర్‌తో వ్యవహరించిన తీరుపై వీడియో క్లిప్పింగ్​ను జత చేస్తూ తెదేపా మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత రాసిన లేఖను సుమోటోగా పరిగణించిన హైకోర్టు గత మే 22న సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన విషయం తెలిసిందే. బాధ్యులపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని స్పష్టం చేసింది. ఈ ఘటనలో కుట్ర కోణం దాగుందేమో తేల్చాలని పేర్కొంది. తాజాగా జరిగిన విచారణలో సీబీఐ పీపీ చెన్నకేశవులు వాదనలు వినిపిస్తూ రెండో స్థాయి నివేదికను సీల్డ్ కవర్​లో ఏపీ హైకోర్టుకు సమర్పించామన్నారు. దర్యాప్తు స్థితి ఏమిటని ధర్మాసనం ప్రశ్నించగా .. కేసు సున్నితత్వం వల్ల వివరాల్ని బహిర్గతం చేయలేమన్నారు.

ఇదీ చదవండి : మోగిన బల్దియా నగారా.. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.