ETV Bharat / city

Viveka murder case: 'అనుమానితుల ఇళ్లలో ఆయుధాలు స్వాధీనం'

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఏపీ పులివెందులలోని అనుమానితుల ఇళ్లలో సోదాలు నిర్వహించి పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. కడపకు చెందిన ముగ్గురు బ్యాంకు అధికారులతో పాటు వైఎస్ అభిషేక్​రెడ్డి ఇవాళ సీబీఐ విచారణకు హాజరయ్యారు.

viveka murder
వివేకా హత్య
author img

By

Published : Aug 11, 2021, 6:48 PM IST

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు దూకుడు పెంచారు. ఏపీ పులివెందులలోని అనుమానితుల ఇళ్లలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. సునీల్‌ యాదవ్, దస్తగిరి కుటుంబసభ్యుల ఇళ్లలో సోదాలు నిర్వహించి కత్తి, కొడవలి, పలుగు, పారను స్వాధీనం చేసుకున్నారు. వైఎస్‌ అభిషేక్‌రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

విచారణ వేగవంతం..

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో 66వ రోజు విచారణ కొనసాగుతోంది. కడప, పులివెందుల ప్రాంతాల్లో అనుమానితులను విచారిస్తున్నారు. కడప కేంద్ర కారాగారానికి కర్ణాటక నుంచి 20 వాహనాల్లో బ్యాంకు అధికారులు, రెవెన్యూ అధికారులు వచ్చినట్టు సమాచారం.

కడపకు చెందిన ముగ్గురు బ్యాంకు అధికారులు ఇవాళ విచారణకు హాజరయ్యారు. కర్ణాటకలో ల్యాండ్ సెటిల్​మెంట్​కు సంబంధించి వివేకా, సునీల్ మధ్య వివాదం ఉన్న నేపథ్యంలో అక్కడి బ్యాంక్ అధికారులు, రెవెన్యూ సిబ్బందిని సీబీఐ అధికారులు పిలవడం చర్చనీయాంశమైంది. సునీల్ యాదవ్ కస్టడీలో ఇచ్చినటువంటి సమాచారం మేరకు అన్ని ప్రాంతాల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి మధ్యాహ్నం సీబీఐ అధికారులను కలిసి వెళ్లారు. కేసు దర్యాప్తు గురించి అడిగి తెలుసుకున్నారు.

ఇదీ చూడండి:

Ganesh immersion: నిమజ్జనంపై నిర్ణయానికి వారం సమయం కోరిన ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.