ETV Bharat / city

వివేకా హత్య కేసులో కీలక మలుపు.. సీబీఐ ముందుకు మళ్లీ సునీత - వివేకా హత్య కేసుపై వార్తలు

వివేకా కుమార్తె సునీతను రెండోసారి సీబీఐ అధికారులు విచారణకు పిలిచారు. బుధవారం వైకాపా నేత శివశంకర్ రెడ్డిని విచారించిన సీబీఐ అధికారులు... గురువారం మళ్లీ సునీతను విచారణకు హాజరు కావాలని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది.

cbi-officials-investigated-viveka-daugher-in-viveka-murder-case
వివేకా హత్య కేసులో కీలక మలుపు.. సీబీఐ ముందుకు మళ్లీ సునీత
author img

By

Published : Jul 30, 2020, 8:50 PM IST

మాజీమంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. వివేకా కుమార్తె సునీతను రెండోసారి సీబీఐ అధికారులు విచారణకు పిలిచారు. ఏపీలోని కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో మంగళవారం 7 గంటలపాటు సునీతను ప్రశ్నించిన సీబీఐ అధికారులు... గురవారం మరోదఫా విచారణకు పిలిచారు. ఉదయం 10.30 గంటల నుంచి విచారణ జరుగుతోంది.

ఇప్పటికే 15 మంది అనుమానితుల పేర్లతో హైకోర్టుకు జాబితా ఇచ్చిన సునీత... వారి వివరాలను సీబీఐ ముందుంచినట్లు తెలిసింది. బుధవారం వైకాపా నేత శివశంకర్ రెడ్డిని విచారించిన సీబీఐ అధికారులు... గురువారం మళ్లీ సునీతను విచారణకు హాజరు కావాలని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కేసులో శివశంకర్​రెడ్డి కీలకంగా ఉన్నారని సునీత పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె నుంచి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు సీబీఐ అధికారులు సునీత ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.