రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించడంతో చాలా మంది ఆకలితో అలమటిస్తున్నారు. పనుల్లేక పస్తులుంటున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన సురేశ్..ఎంబీఏ పూర్తి చేసి... పేదలకు సహాయం చేయడానికి కేర్ అండ్ షేర్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించాడు. దాతల నుంచి విరాళాలు సేకరించి పేదవారికి, అనాథలకు తన ఎన్జీవో ద్వారా సాయం అందిస్తాడు. ఈ సంస్థ ద్వారా కరోనా తొలి దశ నుంచి ఇప్పటి వరకు పేదలకు, కార్మికులకు, రోడు పక్కన ఉండే సాయం చేస్తున్నాడు.
ఈ కేర్ అండ్ షేర్ ఫౌండేషన్‌లో దాదాపు 40 మందికి పైగా సభ్యులు ఉన్నారు. మురికివాడల్లో నివసించే నిరుపేదలకు నిత్యావసరాలు అందించేవాడు. హైదరాబాద్‌లో లాక్‌డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన వారికి.. రోడ్డు పక్కన ఉండే వారికి అన్నం, మాస్కులు అందిస్తున్నాడు. లాక్‌డౌన్ కారణంగా అభాగ్యులు పడుతున్న ఇబ్బందులు తీర్చేందుకు కృషి చేస్తున్నాడు. ఆంక్షలు అమలు చేయడానికి నిరంతరం కృషి చేస్తున్న పోలీసులకు ఆహారం, ఓఆర్ఎస్ అందిస్తోంది.. కేర్ అండ్ షేర్ సంస్థ.
ఆకలితో అలమటించే నిరుపేదల కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్‌లోనూ కొనసాగిస్తానని చెబుతున్నాడు.
- ఇదీ చదవండి : వసతులున్నాయ్.. సిబ్బంది ఏరీ?