Amaravathi farmers protest: రాజధాని భూములను ప్రభుత్వం అమ్మకానికి పెట్టడంపై అమరావతి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం దొండపాడులో.. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. బిఆర్ శెట్టి సంస్థకు కేటాయించిన భూముల వద్ద బైఠాయించి.. నినాదాలు చేశారు. రాజధానిలో నిర్మాణాల్లేకుండా భూములు అమ్మడం సరికాదన్న రైతులు.. వెంటనే సర్కారు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఎంపీలు, మంత్రులు మూడు రాజధానులని ఇప్పటికే ప్రకటనలు చేశారని.. ముందుగా వారితోనే జగన్ స్వయంగా అమరావతే పరిపాలన రాజధానిగా ఉంటుందని ప్రకటించిన తర్వాతే ఈ ప్రాంతంలోకి రావాలని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: