ETV Bharat / city

ఏపీ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు.. వాళ్లకే ఛాన్స్

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఎప్పుడనే అంశంపై గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. తాజాగా ఈ చర్చలకు తెర దించుతూ రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 22న మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని వెల్లడించింది.

ఏపీ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు.. వాళ్లకే ఛాన్స్
ఏపీ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు.. వాళ్లకే ఛాన్స్
author img

By

Published : Jul 20, 2020, 5:53 PM IST

ఏపీ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 22 మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత మంత్రి వర్గ విస్తరణ జరగనుంది. అదే రోజు నూతన మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజీనామా చేసిన మంత్రుల సామాజిక వర్గానికే తిరిగి మంత్రి వర్గంలో అవకాశం దక్కనుంది.

శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. మత్స్యకార కుటుంబానికి చెందిన శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజుకు మంత్రివర్గంలో చోటు దక్కనుందని సమాచారం. మంత్రివర్గ సభ్యుల పేర్లను మంగళవారం అధికారికంగా ఏపీ ప్రభుత్వం వెల్లడించనుంది.

రాజ్యసభకు ఎంపికైన మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానంలో కొత్తగా ఇద్దరికి మంత్రి పదవులు దక్కనున్నాయి. మంత్రుల శాఖల్లో మార్పులు ఉండకపోవచ్చని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు.

ఇదీ చదవండి: తెలంగాణ: నిమ్స్​లో కొవిడ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్​ ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.