ETV Bharat / city

ఇవాళ్టి నుంచి షెడ్యూలు ప్రకారం బస్సులు

ఆర్టీసీ బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. టికెట్ల ధరల పట్టికలు ఏర్పాటు చేస్తున్నామని.... రూపాయి ఎక్కువ తీసుకున్నా ఫిర్యాదు చేయాలని రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ సూచించారు. నేటి నుంచి అన్ని డిపోల నుంచి షెడ్యూలు ప్రకారం బస్సులు నడుస్తాయని తెలిపారు.

ఇవాళ్టి నుంచి షెడ్యూలు ప్రకారం బస్సులు
author img

By

Published : Oct 10, 2019, 5:40 AM IST

Updated : Oct 10, 2019, 6:56 AM IST

రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ చర్యలపై మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌ శర్మ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లాల ఆర్టీసీ అధికారులు, ఈడీలు, రీజనల్‌, డివిజనల్‌ మేనేజర్లు, ఆర్టీఓలతో నాలుగు గంటలపాటు పరిస్థితిపై సమీక్షించారు. కార్మికుల సమ్మె, రవాణా శాఖ తీసుకున్న చర్యలు, పండుగకు వెళ్లిన వారు తిరిగి వచ్చేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు.

ఇవాళ్టి నుంచి షెడ్యూలు ప్రకారం బస్సులు

ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా...
టికెట్‌ ధర కంటే ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరికలు జారీ చేశారు. బస్సుల్లో డ్రైవర్‌ సీటు వెనకాల ధరల పట్టిక ఉంచుతామని... అక్కడే ఆయా కంట్రోల్‌ రూంల నెంబర్లను కూడా ప్రదర్శిస్తామని వివరించారు. ధర కంటే ఎక్కువ ఛార్జీ తీసుకుంటే ఆ నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని స్పష్టం చేశారు. ఇందుకోసం పోలీస్‌ శాఖ నుంచి డీఎస్పీ స్థాయి అధికారిని ఇన్‌ఛార్జీగా నియమిస్తూ ప్రతి డిపోలో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

బస్‌పాస్‌లకు అనుమతి
ఈ నెల 14 నుంచి పాఠశాలలు ప్రారంభం కానుండటు వల్ల షెడ్యూల్‌ ప్రకారం బస్సులను నడుపుతామని అజయ్​ కుమార్​ పేర్కొన్నారు. బస్‌పాస్‌లను యదావిధిగా అనుమతించాలని ఆదేశాలిచ్చామని మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థులు, దివ్యాంగులు, పాత్రికేయులు, ఉద్యోగులతో పాటు బస్‌పాసులు అనుమతించడం లేదనే ఫిర్యాదు రావద్దని మంత్రి పువ్వాడ ఆదేశించారు.

ఇవీ చూడండి: ఉద్యోగం పోయిందనే మనస్థాపంతో ఆర్టీసీ డ్రైవర్ మృతి!

Intro:Body:Conclusion:
Last Updated : Oct 10, 2019, 6:56 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.