ETV Bharat / city

'రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం భారీగా తగ్గింది' - cm kcr review on budjet

కరోనా నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు భారీగా తగ్గినందున మధ్యంతర సమీక్ష నిర్వహించాలని అధికారులను సీఎం కేసీఆర్​ ఆదేశించారు. ఏఏ శాఖలకు ఎన్ని నిధులు విడుదల చేసే వెసులుబాటు ఉంటుందో నిర్ణయించాలని అధికారులకు సూచించారు.

'రాష్ట్రానికి వచ్చే ఆదాయం భారీగా తగ్గింది'

author img

By

Published : Oct 23, 2020, 7:41 PM IST

రాష్ట్ర వార్షిక బడ్జెట్​పై మధ్యంతర సమీక్ష చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు భారీగా తగ్గినందున మధ్యంతర సమీక్ష నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. లాక్​డౌన్ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం భారీగా తగ్గిందన్న సీఎం... కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో కూడా కోత పడిందని చెప్పారు.

కేంద్ర జీడీపీ కూడా మైనస్ 24 శాతానికి పడిపోయిందని... ఆ ప్రభావం రాష్ట్రాలపై పడుతుందన్నారు. ఈ పరిస్థితుల్లో వాస్తవంగా ఎన్ని నిధులు అందుబాటులో ఉంటాయో అంచనా వేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. ఏయే శాఖలకు ఎన్ని నిధులు విడుదల చేసే వెసులుబాటు ఉంటుందో నిర్ణయించాలన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరం మొత్తం బడ్జెట్​పై సమీక్ష నిర్వహించి... ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు.

ఇదీ చూడండి: మద్దతు ధర చెల్లించి మక్కలు కొనుగోలు చేస్తాం: సీఎం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.