ఏపీ కడప జిల్లాకు చెందిన తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవిని పోలీసులు పులివెందుల కోర్టులో హాజరుపరిచారు. ఆయనకు మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండు విధించారు. ఈనెల 18 వరకు రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు బీటెక్ రవిని కడప కేంద్రకారాగానికి తరలించారు.
2018 మార్చి 4న పులివెందులలో జరిగిన తెదేపా, వైకాపా వర్గాల ఘర్షణ కేసులో నిందితుడుగా ఉన్న బీటెక్ రవిని పోలీసులు నిన్న మధ్యాహ్నం చెన్నై విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి కడప జిల్లా పోలీసులు బీటెక్ రవిని అర్ధరాత్రి పులివెందుల తీసుకొచ్చారు. ఉదయం 7.30 గంటల సమయంలో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా.. 14 రోజుల రిమాండు విధించారు.
![బీటెక్ రవికి 14 రోజులు రిమాండ్.. కడప కేంద్ర కారాగారానికి తరలింపు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10109221_1033_10109221_1609729685608.png)
బీటెక్ రవిని చూసేందుకు ఆయన భార్య, కుటుంబ సభ్యులు నిన్న అర్థరాత్రి నుంచి వేచి చూస్తున్నారు. అయినా రవిని చూసేందుకు అనుమతి ఇవ్వలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి: తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి అరెస్టు