ETV Bharat / city

DIAL 100: 'నాకు బలవంతంగా పెళ్లి చేస్తున్నారు.. ఆపండి సార్'..!

మరికొన్ని గంటల్లో కూతురి వివాహం. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బంధువులంతా వచ్చేశారు. ఎవరికి వారు పెళ్లి పనుల్లో బిజీ అయిపోయారు. అంతా సవ్యంగా జరుగుతుండగా.. సీన్​లోకి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఈ పెళ్లి ఆపేయాలన్నారు. తమ కూతురి పెళ్లి అంగరంగ వైభవంగా జరిపిద్దామనుకున్న ఆ తల్లిదండ్రులు ఆ మాటలతో షాక్​కు గురయ్యారు. పోలీసుల ద్వారా అసలు విషయం తెలుసుకుని కంగుతిన్నారు.

DIAL 100: నాకు బలవంతంగా పెళ్లి చేస్తున్నారు.. ఆపండి సార్..!

author img

By

Published : Aug 27, 2021, 7:27 PM IST

తల్లిదండ్రులు తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారంటూ విశాఖలోని ఆరిలోవ ఆదర్శనగర్​కు చెందిన భార్గవి అనే యువతి డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. మరి కొన్ని గంటల్లో పెళ్లి జరగాల్సి ఉండగా.. తల్లిదండ్రులు తనకు బలవంతపు, ఇష్టం లేని వివాహం చేస్తున్నారంటూ పోలీసులకు తెలిపింది. ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు.. ఆ బలవంతపు పెళ్లిని అడ్డుకున్నారు.

DIAL 100: 'నాకు బలవంతంగా పెళ్లి చేస్తున్నారు.. ఆపండి సార్'..!

పోలీసులకు ఫిర్యాదు చేయడంపై ఆగ్రహించిన భార్గవి తల్లిదండ్రులు.. ఆమెపై చేయిచేసుకున్నారు. తల్లిదండ్రుల బారి నుంచి తనను కాపాడాలంటూ భార్గవి మహిళ చేతన అనే సంఘాన్ని ఆశ్రయించింది. రంగంలోకి దిగిన మహిళా సంఘాల ప్రతినిధులు.. యువతికి ఆమె ప్రేమించిన వ్యక్తితోనే వివాహం జరిపించాలని డిమాండ్ చేశారు. యువతి మేజర్ కావడంతో ఆమె ఇష్ట ప్రకారమే పెళ్లి చేయాలని పోలీసులు తల్లిదండ్రులకు సూచించారు.

ఇదీ చదవండి: software employee suicide: పెళ్లికావడం లేదని సాఫ్ట్​వేర్​ ఉద్యోగి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.