Booster Dose Vaccination: కరోనా మూడోదశ, ఒమిక్రాన్ కొత్త వేరియంట్ వ్యాప్తి దృష్ట్యా బూస్టర్ డోస్‌పై ఆసక్తి నెలకొంది. కేంద్రం ఆదేశాల మేరకు నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా బూస్టర్ డోస్‌లు పంపిణీ చేపట్టనున్నట్టు వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది. ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్ లైన్ వర్కర్లతోపాటు 60 ఏళ్లు దాటి...దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి బూస్టర్ డోస్ ఇవ్వనున్నారు.
వ్యక్తిగత ఇష్టంతోనే బూస్టర్టీకా..
బూస్టర్ డోస్ పూర్తిగా వ్యక్తిగత ఇష్టంతో కూడుకున్నదని పేర్కొన్న ఆరోగ్య శాఖ... వైద్యులను సంప్రదించిన అనంతరం బూస్టర్ డోస్ తీసుకోవాలని సూచించింది. గతంలో తీసుకున్న టేకానే తిరిగి మూడో డోస్‌గా ఇవ్వనున్నట్టు పేర్కొంది. గతంలో చేసుకున్న టీకా రిజిస్ట్రేషన్ ఆధారంగా కోవిన్‌లో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందని వివరించింది. కొత్తగా ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదన్న వైద్యారోగ్యశాఖ... నేరుగా టీకా కేంద్రాలకు వెళ్లి వ్యాక్సిన్ తీసుకునే సదుపాయాన్ని కల్పించింది.
9నెలలు పూర్తైనవారే అర్హులు..
రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకుని 9నెలలు పూర్తైనవారు బూస్టర్ డోస్‌కి అర్హులుగా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో 8లక్షల 32 వేల మంది 60 ఏళ్లు పైబడి దీర్ఘకాలిక వ్యాధులున్నవారు ఉన్నట్టు తేల్చారు. ఈనెల 3 నుంచి ప్రారంభమైన టీనేజర్ల వ్యాక్సినేషన్‌కి విశేష స్పందన వస్తోంది. వారంలోనే దాదాపు 37 శాతం మంది టీకా తీసుకున్నట్టు ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. బూస్టర్ డోసులు పంపిణీని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సర్కారు సూచిస్తోంది. అర్హులైన వారంతా తాము తీసుకున్న టీకాలనే మరోసారి పొందవచ్చని తెలిపింది.
ఇదీ చూడండి: