వరంగల్ నగర ప్రవేశ మార్గాన్ని రీ డిజైన్ చేసి అక్కడ కొత్తగా ఫ్లై ఓవర్ నిర్మించాలని... కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ లేఖ రాశారు. హైదరాబాద్ నుంచి వరంగల్ నగరంలోకి ప్రవేశించే కూడలి వద్ద అండర్ పాస్ ఉండటం వల్ల డ్రైవర్లు గందరగోళానికి గురై... ప్రమాదాలకు గురవుతున్నారని పేర్కొన్నారు. స్మార్ట్ సిటీ పథకానికి ఎంపికైనందున... 406 కిలోమీటర్ల వైశాల్యం, 10 లక్షల జనాభా కలిగిన నగరానికి రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు.

జాతీయ రహదారి-163పై కురుణాపురం వద్ద నిర్మించిన ఓవర్ పాస్ వైశాల్యం ఇరువైపులా 7.5 మీటర్లు ఉండగా... కానీ క్యారియెజ్ పాస్ మాత్రం కేవలం 6మీటర్లు మాత్రమే ఉందని, కనీసం 7 మీటర్లు ఉండాలని వివరించారు. కూడలికి ముందు ప్రమాదకరంగా ఉన్న మలుపులను సరి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశాలపై తక్షణమే చర్యలుప తీసుకోవాలని కోరారు.
ఇదీ చూడండి: 'అగ్రకులాల పేదల రిజర్వేషన్ల జీవో బాధ్యత నాది'