ETV Bharat / city

ఇంతకీ అసలు భోగి అంటే ఏంటీ? - ap news today

సంక్రాంతి అంటే మనకు సంబరాల పండగ. చిన్నా పెద్దా.. ఏకమై చేసుకునే ఈ పండగలో మెుదటి రోజు భోగి. ఇంతకీ భోగి అంటే ఏంటీ? అసలు భోగి మంటలు ఎందుకేస్తారు? దాని వెనక ఉన్న అర్థం, పరమార్థమేంటి?

bogi-mantalu at telugu states
ఇంతకీ అసలు భోగి అంటే ఏంటీ?
author img

By

Published : Jan 14, 2020, 7:47 AM IST

మన ప్రతి సంప్రదాయం వెనక అర్థాలు.. అంతరర్థాలు ఉంటాయనేది నిజం. వాటి విలువలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే.. మంచిది. అవే ఇప్పటి తరాలకు మార్గదర్శకాలు. భోగి అనగానే ఉదయాన్నే లేచి ఆనందంగా భోగి మంటలు వేసుకునే సంప్రదాయం మన కళ్లకు కడుతుంది.
ధనుర్మాసములో వచ్చే భోగికి భోగిపర్వం అని పేరు. భోగి అంటే భోగము కలిగింది అని అర్థం. ఈ పండగకే రైతులకు పంట చేతికి వస్తుంది. వ్యవసాయ పనులు తగ్గి.. చేతికి వచ్చిన పంటను అనుభవానికి తెచ్చుకొని భోగభాగ్యాలు అనుభవించే పండుగే ఇది. అయితే భోగము అనే మాటకు అర్థం అనుభవం. ఆనందంగా దేనిని అనుభవిస్తామో.. దేనిని అనుభవించడం వల్ల ఆనందం పొందుతామో అదే భోగము.

ఇంతకీ అసలు భోగి అంటే ఏంటీ?

అందులోనూ ఆరోగ్యం దాగుంది..

జనవరి నెల.. అసలే చలి. వెచ్చదనం కోసమే భోగి మంటలని ఇప్పటి తరంలోని కొంతమంది అభిప్రాయం. అందులోనూ మన ఆరోగ్యం దాగుంది. ధనుర్మాసం నెలంతా ఇంటి ముందు ఆవు పేడతో గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటల్లో వాడతారు. దేశీయ ఆవు పేడ పిడకలను కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది. భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రావి, మామిడి, మేడి మెుదలైన ఔషధ చెట్ల బెరళ్లు వేస్తారు. అవి కాలేందుకు ఆవు నెయ్యిని జోడిస్తారు. ఈ ఔషధ మూలికలు కాల్చడం వలన విడుదలయ్యే గాలి చాలా మంచిది. మన శరీరంలోని నాడుల్లోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్ర పరుస్తుందట. అలా భోగి మంటల్లో పాల్గొనే సాంప్రదాయం వల్ల వచ్చే గాలి అందరికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇంట్లో ఉండే పాత వస్తువులు మంటల్లో వేస్తాం. వాటిల్లో ఉండే చెదలు లాంటి పురుగులతో మనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకే ఈ సంప్రదాయం.

మరీ ఇప్పుడు మనమేం చేస్తున్నాం
సాంకేతిక పెరిగింది. మన ఆలోచన విధానం మారింది. ఇప్పడంతా రబ్బర్ టైర్లు, ప్లాస్టిక్ కుర్చీలు... పెట్రోల్ పోసి తగలబెట్టి.. ఆ విషాన్నే మనం పీలుస్తున్నాం. కొత్త రోగాలను ఆహ్వానిస్తున్నాం. భోగి మంటల్లో పనికి రాని వస్తువులు కాల్చడమంటే.. ఇంట్లో ఉండే కవర్లు, వైర్లే కాదు. భోగి మంటల్లో వేయాల్సింది మనలోని పనికి రాని అలవాట్లు, చెడు లక్షణాలు... అప్పుడే అన్ని రకాల సౌభాగ్యాలు.

ఇదీ చదవండి: సంక్రాంతి పండగ రద్దీ.. సరిపోని రైళ్లు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.