సంక్రాంతి పండగ సందర్భంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువైంది. బెర్తుల్లో సీట్లు దొరక్క... సామానులు పెట్టుకునే బోగీల్లోనూ ప్రయాణికులు వెళుతున్నారు. పండగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే 408 ప్రత్యేక రైళ్లు, 61 జన్సాధారణ్, 31 సువిధ రైళ్లు నడిపినప్పటికీ సరిపోవడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు.
ప్రత్యేక రైళ్లలో ధరలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రయాణికుల రద్దీ ఇతర అంశాలపై సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మా ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు.
ఇవీ చూడండి: ఇకపై సీఆర్డీఏ ఉండదా..?