ETV Bharat / city

Black Fungus: ఏపీలో అంతకంతకూ విస్తరిస్తోన్న బ్లాక్‌ఫంగస్‌..!

ఏపీలో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కరోనా సోకని వ్యక్తులూ ఈ వ్యాధి బారినపడినట్లు వైద్యారోగ్యశాఖ నిర్ధరించింది. అధికారిక గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు 1,179 మందికి బ్లాక్‌ఫంగస్‌ సోకింది. 14 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు.

ఏపీలో అంతకంతకూ విస్తరిస్తోన్న బ్లాక్‌ఫంగస్‌..!

author img

By

Published : Jun 1, 2021, 10:44 AM IST

ఏపీలో అంతకంతకూ విస్తరిస్తోన్న బ్లాక్‌ఫంగస్‌..!

కరోనా రెండో దశ ఇప్పటికీ ప్రజలను వణికిస్తుంటే.. మ్యుకార్‌మైకోసిస్‌ అనే ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ మరింత భయాందోళనకు గురిచేస్తోంది. మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో కనిపించే ఈ వ్యాధి.. ఇప్పుడు అనేక మందిలో కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్​లో ఈ బ్లాక్​ ఫంగస్​ తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు 1,179 మంది దీని బారినపడ్డారు. కరోనా చికిత్సలో ఎక్కువ స్టెరాయిడ్లు వాడిన వారు ఈ వ్యాధి బారినపడ్డారని గతంలో నిపుణులు చెప్పారు. కానీ కరోనా నిర్ధరణ కాకపోయినా.. ఎలాంటి స్టెరాయిడ్లు వినియోగించని వారిలోనూ బ్లాక్‌ఫంగస్ సోకినట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రకటించడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది.

కృష్ణా జిల్లాలోనూ బ్లాక్‌ఫంగస్ కేసులు గుబులు రేపుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని బాధితులకు కాకినాడ జీజీహెచ్‌లో మాత్రమే ఈ వ్యాధికి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటి వరకు 100 మందికి పైగా రోగులు బ్లాక్‌ఫంగస్‌తో ఆస్పత్రిలో చేరారు. వీరిలో ప్రస్తుతం 68 మంది జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో ఆరుగురు రోగులు బ్లాక్‌ఫంగస్‌తో చనిపోయారు. వైద్య నిపుణుల బృందం పరిశీలన అనంతరం మాత్రమే ప్రత్యేక ఔషధాలు వినియోగించాలని బాధితులకు వైద్యులు చెబుతున్నారు.

బ్లాక్‌ఫంగస్‌ చికిత్స కోసం అవసరమైన ఔషదాలను కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రాలకు సరఫరా చేస్తోంది. కరోనా వ్యాధిగ్రస్తులకు ఉపయోగించే స్టెరాయిడ్ల వినియోగంపై ఆచితూచి వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: KTR : మంత్రి కేటీఆర్ ట్విటర్​కు భూసమస్యల వినతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.