ETV Bharat / city

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా భాజపా వ్యూహాలు - పార్లమెంట్ ప్రవాస్ యోజన

Parliament Prawas Yojana: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బహుముఖ వ్యూహంతో ముందుకెళ్లాలని నిర్ణయించింది భాజపా. ఓ వైపు తెరాస సర్కార్‌ వైఫల్యాలు ఎండగడుతూనే మరోవైపు... కేంద్రప్రభుత్వం ప్రభుత్వ అభివృద్ధిని జనంలోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా... ఎన్డీఏ సర్కార్‌ 8ఏళ్ల పాలనలో అందిస్తున్న పథకాలు, చేసిన అభివృద్ధిని వివరించడమే లక్ష్యంగా... పార్లమెంట్ ప్రవాస్ యోజనను చేపట్టనుంది. ఈ నెల నాలుగో వారంలో కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

BJP
BJP
author img

By

Published : Jul 6, 2022, 1:44 PM IST

Parliament Prawas Yojana: తెలంగాణలో పాగా వేయడమే అజెండాగా... కమలదళం వ్యూహాలను ఉద్ధృతం చేస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం కమిటీలను కూడా వేసింది. పార్లమెంట్‌ స్థానాలపైనా కాషాయదళం ప్రత్యేక గురిపెట్టింది. కేంద్రంలోని నరేంద్రమోదీ పథకాల విజయాల్ని ప్రచారం చేయడంతో పాటు... అమలుతీరు తెలుసుకునేందుకు కేంద్రమంత్రులు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించనున్నారు.

ఇందుకోసం 17 పార్లమెంట్‌ స్థానాలుండగా... సికింద్రాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌ మినహా తొలిదశలో 14స్థానాలను ఎంపిక చేసింది. వీటిని నాలుగు క్లస్టర్లుగా విభజించి... ఒక్కో దానికి ఒక్కో కేంద్రమంత్రిని ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. ఆ క్లస్టర్‌ పరిధిలో ఇన్‌ఛార్జీ మంత్రితో పాటు ఒకరిద్దరు కేంద్రమంత్రులు పర్యటించనున్నారు. లోక్‌సభ ఎన్నికలకు వరకు మంత్రులు ఈ కార్యక్రమాన్ని విడతలవారీగా నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అధ్యక్షతన జరిగిన పదాధికారుల సమావేశంలో చర్చించారు. క్లస్టర్లతో పాటు ఒకటి లేదా రెండు పార్లమెంట్‌ స్థానాలకు ప్రత్యేకంగా ఒక కేంద్ర మంత్రికి బాధ్యతలు అప్పగించారు. ప్రతి పార్లమెంట్ నియోజ‌కవ‌ర్గంలో మూడ్రోజుల పాటు పర్యటించనున్న కేంద్ర మంత్రులు తక్కువ ఓట్లు వచ్చిన బూత్‌లపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు.

ఇలా ఒకవైపు కేంద్రప్రభుత్వ అభివృద్ధిని జనంలోకి తీసుకెళ్తూనే... తెరాస వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది కాషాయదళం. రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో వివిధ కార్యక్రమాల నిర్వహణకు కార్యాచరణ రూపొందించింది. త్వరలో బండి సంజయ్‌ మరోవిడత పాదయాత్ర మొదలు కానుండగా... అదేసమయంలో ముఖ్యనేతలతో బైక్‌ ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం 10మంది నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఒక్కో నేత పదేసి నియోజకవర్గాల చొప్పున వందస్థానాల్లో బైక్‌ ర్యాలీలు నిర్వహిస్తారని ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు.

మొదటి సారి ఓటు వేసేవారిని పార్టీవైపు మళ్లించేందుకు ప్రత్యేక దృష్టిసారించింది.. కమలదళం. రాష్ట్రపతి అభ్యర్థిగా భాజపా ద్రౌప‌దీ ముర్మూను ప్రతిపాదించింది. గిరిజ‌న తండాల్లో.. గ్రామాల్లో ఆమె చిత్ర పటాల‌తో ర్యాలీలు నిర్వహించేందుకు ప్రత్యేక కార్యాచ‌ర‌ణ‌ను రూపొందించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.