ETV Bharat / city

BANDI SANJAY: దేశం కోసం ధర్మం కోసం పనిచేయడమే సర్దార్​కు ఘన నివాళి

సీఎం కేసీఆర్​కు జాతీయ నేతల కంటే నిజాంపైనే ప్రేమ ఎక్కువని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ విమర్శించారు. నాడు సర్దార్​ జయంతి గుర్తించని కాంగ్రెస్​ నేడు ఆయన విగ్రహానికి నివాళులు అర్పిస్తోందని సంజయ్​ అన్నారు.

bandi sanjay
bandi sanjay
author img

By

Published : Oct 31, 2021, 5:15 PM IST

దేశం కోసం ధర్మం కోసం ప్రతి ఒక్కరు పనిచేయాలని.. అప్పుడే వల్లభ్​ భాయ్ పటేల్​కు ఘనమైన నివాళి అర్పించినట్లు అవుతుందని.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ అన్నారు. సర్దార్​ పటేల్​ జయంతి సందర్భంగా హైదరాబాద్​ కేపీహెచ్​బీలోలో ఏర్పాటుచేసిన రన్​ ఫర్​ యూనిటీ కార్యక్రమంలో సంజయ్​ పాల్గొన్నారు. సర్దార్​ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం జెండా ఊపి రన్​ ఫర్​ యూనిటీ ర్యాలీ ప్రారంభించారు.

పటేల్​ జయంతిని గుర్తించని కాంగ్రెస్.. నేడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తోందని బండి సంజయ్​ ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్​కు జాతీయ నేతల కంటే నిజాంపైనే ప్రేమ ఎక్కువని సంజయ్​ విమర్శించారు. తెలంగాణలో పాకిస్తాన్ జెండా ఎగరవేస్తే ఉరికించి కొడతామని.. కరీంనగర్​లో జరిగిన సంఘటనే దీనికి నిదర్శనమని హెచ్చరించారు. యువకుల్లో దేశభక్తి నింపడానికి రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్వహిస్తున్నారని.. నవభారత్ నిర్మాణం దిశగా ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని కోరారు.

BANDI SANJAY: దేశం కోసం ధర్మం కోసం పనిచేయడమే సర్దార్​కు ఘన నివాళి

ఇదీచూడండి: 'పటేల్ స్ఫూర్తితోనే భారత్ అన్ని సవాళ్లు ఎదుర్కోగలుగుతోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.