ETV Bharat / city

Bandi Sanjay : ప్రాజెక్టుల వద్ద పోలీసులను ఎందుకు పెట్టారు? - bandi sanjay on krishna water dispute

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలను రెచ్చగొట్టేందుకే జలవివాదాన్ని తెరపైకి తీసుకువచ్చారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్‌, జగన్ మధ్య ఉన్న అవగాహన బయటపడుతుందనే.. 2020 ఆగస్టు5న కేంద్రం ఏర్పాటు చేసిన అపెక్స్ కౌన్సిల్​కు కేసీఆర్ హాజరు కాలేదని అన్నారు.

Bandi Sanjay
బండి సంజయ్
author img

By

Published : Jul 6, 2021, 2:18 PM IST

రాయలసీమ ఎత్తిపోతలు ఆపాలని కేంద్రానికి లేఖ రాసినట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ తెలిపారు. 2020 ఆగస్టు 5న కేంద్రం అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేసిందని చెప్పారు. 2020 ఆగస్టు 5న కావాలనే కేసీఆర్‌ మంత్రివర్గ సమావేశం పెట్టుకున్నారని ఆరోపించారు. కేసీఆర్‌, జగన్ మధ్య ఉన్న అవగాహన బయటపడుతుందనే కౌన్సిల్‌ భేటీకి వెళ్లలేదని అన్నారు.

కేసీఆర్‌ రోజుకోమాట మాట్లాడుతున్నారని బండి సంజయ్ విమర్శించారు. ప్రాజెక్టుల వద్ద పోలీసులను పెట్టాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీమ ఎత్తిపోతల పనులు పూర్తవుతుంటే కేసీఆర్ ఫాంహౌస్‌లో విశ్రాంతి తీసుకున్నారని మండిపడ్డారు. ప్రజలను రెచ్చగొట్టేందుకే ఇద్దరు సీఎంలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజల్లో అయోమయం సృష్టించేందుకే కేసీఆర్‌ కొత్త డ్రామాకు తెరలేపారన్న బండి సంజయ్.. కేంద్రమంత్రికి సీఎం కేసీఆర్‌ ఫోన్‌ చేయడం ఒక జోక్ అని పేర్కొన్నారు. కేసీఆర్‌ అన్యాయాల కారణంగానే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతోంది దుయ్యబట్టారు. దక్షిణ తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని భాజపా సహించదని అన్నారు. ఈ వివాదంపై పోరాటం చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు.

అప్పుడు చంద్రబాబుతో కుమ్మక్కయ్యారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్​ను చంద్రబాబు కాళ్ల వద్ద తాకట్టు పెట్టారు. ఇప్పుడు జగన్ విషయంలోనూ అదే జరిగింది. ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి ప్రజలను మోసం చేస్తున్నారు. కేసీఆర్.. తెలంగాణ ద్రోహి. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే ఎందుకు స్పందించలేదు? ప్రాజెక్టు పూర్తవుతున్న సమయంలో కొత్త డ్రామాకు తెరతీయడానికి గల కారణమేంటి? 299 టీఎంసీలకు ఒప్పందం చేసుకుని తెలంగాణకు అన్యాయం చేశారు. ఆ నీటిని ఎలా వినియోగించారో చెప్పాలి.

బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

హుజూరాబాద్​ ఎన్నికల పేరుతో మరోసారి ఉద్యమనేత కార్డును వాడుకోవడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని బండి సంజయ్ అన్నారు. కోట్ల రూపాయలు హుజూరాబాద్ నియోజకవర్గానికి చేరుతున్నాయని ఆరోపించారు. కేసీఆర్ సర్కార్ తీరును ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఈ ఎన్నికలో సీఎంకు బుద్ధి చెబుతారని చెప్పారు. నియోజకవర్గ ప్రజలకు ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని పేర్కొన్నారు. ఎన్ని వ్యూహాలు పన్నినా.. హుజూరాబాద్​ గద్దె మీద కాషాయ జెండానే ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి :
ప్రాజెక్టుల వద్ద పోలీసులను ఎందుకు పెట్టారు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.