రైతు సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్(Telangana CM KCR)కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(BJP Telangana President Bandi Sanjay) బహిరంగ లేఖ(Bandi Sanjay Letter to CM KCR) రాశారు. కర్షకులకు రూ.లక్ష రుణమాఫీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ కింద ఇవ్వాల్సిన రూ.27,500 కోట్లు విడుదల చేయాలని కోరారు.
వరిపంట వేయొద్దన్న ప్రకటనను సీఎం కేసీఆర్(Telangana CM KCR) ఉపసంహరించుకోవాలని సంజయ్( BJP Telangana President Bandi Sanjay) డిమాండ్ చేశారు. ఫసల్ బీమా పథకంలో ప్రభుత్వ వాటా రూ.413.5 కోట్లు చెల్లించాలని చెప్పారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మాదిరి.. రైతులకు ఉచితంగా ఎరువులు ఇవ్వాలని లేఖ(Bandi Sanjay letter to CM KCR)లో పేర్కొన్నారు.
రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని సీఎం కేసీఆర్(Telangana CM KCR)ను సంజయ్ కోరారు. ధరణిలో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని సూచించారు. రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలన్ని.. ప్రభుత్వం చేసినవేనని సంజయ్ ఆరోపించారు. భాజపా రైతులకు అండగా ఉంటూ.. వారి తరఫున పోరాడుతుందని బండి సంజయ్( BJP Telangana President Bandi Sanjay) స్పష్టం చేశారు.