ETV Bharat / city

'తెరాస చేస్తున్న వడ్ల రాజకీయం వెనక మహాకుట్ర" - bandi sanjay speect

Bandi Sanjay Letter: తెలంగాణ రైతు సమాజానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ లేఖ రాశారు. తెరాస చేస్తున్న వడ్ల రాజకీయం వెనుక పెద్ద కుట్ర దాగుందని ఆరోపించారు. తెరాస ప్రభుత్వ కుట్రలను ఛేదించేందుకు తమతో కలిసిరావాలాని సూచించారు.

BJP state president bandi sanjay wrote a letter to farmers on TRS paddy procurement protest

author img

By

Published : Apr 9, 2022, 3:51 PM IST

Bandi Sanjay Letter: తెరాస వడ్ల రాజకీయం వెనుక మహా కుట్ర దాగుందని తెలంగాణ రైతు సమాజానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ లేఖ రాశారు. దళారుల మాఫియాతో సీఎం కేసీఆర్ కుమ్కక్కై భారీ ఎత్తున కమీషన్లు దండుకునేందుకు వ్యూహాం పన్నారని ఆరోపించారు. రైతులు అనివార్యంగా తక్కువ ధరకే వడ్లు విక్రయించేలా పథకం పన్ని.. రైతుల నుంచి వచ్చే ఆగ్రహాన్ని కేంద్రంపైకి మళ్లించే ఎత్తుగడ వేశారని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల మూసివేత కూడా అందులో భాగమేనని బండి తెలిపారు.

కేసీఆర్ కుట్రతో రైతన్నలు పెద్ద ఎత్తున నష్టపోయే ప్రమాదం ఉందని బండి ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కుట్రలను ఛేదించేందుకు అన్నదాతలు తమతో కలిసిరావాలన్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేలా ముఖ్యమంత్రి మెడలు వంచుదామన్నారు. రైతు పండించే ప్రతి గింజా కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. వడ్ల కొనుగోలు కోసం కేంద్రం గత ఏడేళ్లలో ఇప్పటికే తెలంగాణకు రూ. 97 వేల కోట్లను చెల్లించిందని గుర్తు చేశారు. వడ్ల కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం పైసా కూడా ఇప్పటి వరకు ఖర్చు చేయలేదని దుయ్యబట్టారు. వడ్లను సేకరించి కేంద్రానికి అప్పగించకుండా తెరాస సర్కార్ డ్రామాలాడుతోందని మండిపడ్డారు. యాసంగి ధాన్యం సేకరణ వివరాలు కూడా ముఖ్యమంత్రి కేంద్రానికి ఇవ్వలేదన్నారు. కొనుగోలు కేంద్రాలను ఎందుకు మూసేశారో కేసీఆర్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.