కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు.. పరీక్ష ఫీజు, టర్మ్ ఫీజుకు లింక్ పెట్టి విద్యార్థులకు వేధించవద్దని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కోరారు. విద్యార్థులు, అధ్యాపకులను వేధించకుండా యాజమాన్యాలకు కనువిప్పు కలగాలని వసంత పంచమి సందర్భంగా సరస్వతీ దేవిని ప్రార్థించినట్లు సంజయ్ పేర్కొన్నారు.
కేవలం రెండు నెలలకే మొత్తం ఫీజు చెల్లించాలని.. విద్యార్థులను వేధిస్తున్నాయని ఆయన ఆరోపించారు. పరీక్ష ఫీజు కట్టించుకొనేందుకు టర్మ్ ఫీజుతో లింక్ పెట్టవద్దని ఇంటర్ బోర్డు, సెకండరీ బోర్డు చెప్పాయని సంజయ్ గుర్తు చేశారు.
కార్పొరేట్ విద్యాసంస్థల వెనుక తెరాస పెద్దలు ఉన్నారని ఆరోపించిన బండి సంజయ్.. అందువల్లనే ఇంటర్ బోర్డు మౌనం వహిస్తోందని విమర్శించారు. విద్యార్థులకు ఎటువంటి నష్టం జరిగినా ప్రభుత్వ పెద్దల్ని ఎవరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. అధ్యాపకులు, ఉపాధ్యాయులకు వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సందర్భం వచ్చినప్పుడు కళాశాలల చరిత్ర, తెరాస నేతల బండారం బయట పెడతామన్నారు.
ఇవీచూడండి: నేర పరిశోధనపై ఆచరణాత్మక చర్చలు జరుపుతాం: జయప్రకాష్ నారాయణ