అమావాస్య రోజున జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల ప్రమాణస్వీకారం నిర్వహించడం పట్ల భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం భాజపా సభ్యులు ప్రమాణ స్వీకారానికి హాజరవుతారని స్పష్టం వెల్లడించారు. కార్ఖానా కౌలస్య ఎస్టేట్‌లో రామ మందిరం నిధి సేకరణలో భాగంగా... రూ.26 లక్షలు అందించిన కాలనీవాసులకు సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు. నిధి సేకరణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా అపూర్వ స్పందన లభిస్తోందన్నారు.
కేటీఆర్‌ను సీఎం చేయడానికే ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం వెళ్లి దోష నివారణ పూజలు చేయడం నిజం కాదా అని బండి ప్రశ్నించారు. సచివాలయానికి రాని ఏకైక ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కారని ఎద్దేవా చేశారు. ఇన్నాళ్లు లేనిది కేసీఆర్ సచివాలయానికి రావడం వెనకున్న ఆంతర్యం ఏమిటో ప్రజలకు చెప్పాలన్నారు. తెలంగాణ కేసీఆర్ పెద్ద దోషమని... దోష నివారణ పూజలు చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి: కొత్త సచివాలయ పనులను పరిశీలించిన సీఎం