ETV Bharat / city

'ప్రభుత్వ ఆస్పత్రుల మీద నమ్మకం లేకనే ప్రైవేటు బాట'

author img

By

Published : Aug 8, 2020, 3:24 AM IST

రాష్ట్ర ప్రధానకార్యదర్శులు, వివిధ మోర్చాల అధ్యక్షులతో హైదరాబాద్​లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, కరోనా చికిత్సపై ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రజలపక్షాన చేయాల్సిన పోరాటంపై సమావేశంలో చర్చించారు. ప్రభుత్వ ధవాఖానాల్లో కరోనా చికిత్స పట్ల ప్రజలకు నమ్మకం లేకపోవడం వల్లే ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారని దుయ్యబట్టారు.

bjp state president bandi sanjay meeting in corona treatment in telangana

రాష్ట్రంలో కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నా... ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహారిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. ప్రభుత్వ ధవాఖానాల్లో కరోనా చికిత్స పట్ల ప్రజలకు నమ్మకం లేకపోవడం వల్లే ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారన్నారు. ఇదే అదునుగా కార్పొరేట్‌ ఆసుపత్రులు విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేస్తున్నాయని మండిపడ్డారు. భాజపా నూతన రాష్ట్ర కమిటీ ప్రకటించిన తరువాత తొలిసారిగా రాష్ట్ర ప్రధానకార్యదర్శులు, వివిధ మోర్చాల అధ్యక్షులతో బండి సంజయ్‌ సమావేశమయ్యారు.

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, కరోనా చికిత్సపై ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రజలపక్షాన చేయాల్సిన పోరాటంపై సమావేశంలో చర్చించారు. కోర్టు చెప్పినా... రాష్ట్ర ప్రభుత్వం సరైన దిశలో వ్యవహరించకపోవడం శోచనీయమన్నారు సంజయ్​. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకునేలా యువ మోర్చా నాయకులు పోరాటం చేస్తూ... ఆసుపత్రుల వద్ద పేద ప్రజలకు అండగా నిలబడాలని సూచించారు. కార్పొరేట్ ఆస్పత్రులు విపత్కర పరిస్థితుల్లో మానవతా దృక్పథంతో ఆలోచించాల్సింది పోయి ధనార్జనే ధ్యేయంగా పెట్టుకోవడం చాలా బాధాకరమని బండి సంజయ్​ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవీచూడండి: భారత్ బయోటెక్​ ల్యాబ్​ను సందర్శించిన మంత్రి కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.