ETV Bharat / city

'వాళ్లందరికి ఇచ్చారు.. మాకూ ఒక్క ఛాన్స్​ ఇవ్వండి.. ప్లీజ్​.. ప్లీజ్​.. ప్లీజ్​..' - bjp state president bandi sanjay

Bandi Sanjay Comments: ప్రజాసంగ్రామయాత్ర రెండో విడత ముగింపు సభలో తెరాస ప్రభుత్వంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో వెంటనే ఎన్నికలు రావాలని కోరుకుంటున్నానని బండి సంజయ్​ తెలిపారు. తెలంగాణలో కుటుంబ పాలనను అంతమొందించాలని.. అందుకోసం భాజపాకు ఒక్క అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

bjp state president bandi sanjay in prajasangrama yatra closing meeting in tukkuguda

author img

By

Published : May 14, 2022, 8:26 PM IST

Updated : May 14, 2022, 9:28 PM IST

'వాళ్లందరికి ఇచ్చారు.. భాజపాకూ ఒక్క ఛాన్స్​ ఇవ్వండి.. ప్లీజ్​.. ప్లీజ్​.. ప్లీజ్​..'

Bandi Sanjay Comments: గోల్కొండ ఖిల్లా మీద కాషాయ జెండాను ఎగరేయటం ఖాయమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పష్టం చేశారు. కేసీఆర్‌ కుటుంబ పాలనను అంతం చేసేందుకే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ వచ్చారని ఉద్ఘాటించారు. ప్రజాసంగ్రామయాత్ర రెండో విడత ముగింపు సభలో ప్రసంగించిన బండి సంజయ్​.. తెరాస ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలోని పంచభూతాలను సైతం మూర్ఖత్వపు తెరాస ప్రభుత్వం మింగేసిందని నిప్పులు చెరిగారు. నిజాం, ఔరంగజేబు సమాధులకు మోకరిల్లే వాళ్లకు తెలంగాణ గడ్డపై స్థానం లేదని దుయ్యబట్టారు. తెరాస, ఎంఐఎం, కాంగ్రెస్‌ నాటకాలు ఆడుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే.. తెరాసకు వేసినట్లేనని ఆక్షేపించారు. తెలంగాణలో కుటుంబ పాలనను అంతమొందించాలని.. అందుకోసం భాజపాకు ఒక్క అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో ఎక్కడకు పోయినా సమస్యలే స్వాగతం పలికాయని సంజయ్​ తెలిపారు. ప్రతీ చోట కేసీఆర్​ ప్రభుత్వానికి వ్యతిరేకత ఎదురైందన్న సంజయ్​.. అధికార మార్పు జరగాలని ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర నడిచింది తానే అయినా.. నడిపించింది మాత్రం కార్యకర్తలేనని సంజయ్​ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో వెంటనే ఎన్నికలు రావాలని కోరుకుంటున్నానని బండి సంజయ్​ తెలిపారు. ఎన్నికలు అధికారం కోసం కాదని.. మోసపోతున్న తెలంగాణ ప్రజలను కల్వకుంట్ల కుటుంబం నుంచి కాపాడి ప్రజాస్వామ్య పాలన ఇచ్చేందుకేనని స్పష్టం చేశారు.

"దళితులకు మూడెకరాల భూమిస్తామని.. వాళ్లే భూములన్ని ఆక్రమించుకున్నారు. ధరణి పేరుతో ప్రజల భూములను తెరాస నేతలు లాక్కున్నారు. కుటుంబ పాలన వల్ల శ్రీలంకలో ఎలాంటి దుస్థితులు చూశాం. ఇప్పుడు కూడా తెలంగాణలో అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. కీలక శాఖలన్నీ కేసీఆర్‌, కుటుంబ సభ్యుల వద్దే ఉన్నాయి. పాలమూరు ప్రజలు ఇంకా ఎడారి పరిస్థితుల్లోనే ఉన్నారు. ఆర్డీఎస్‌ను పూర్తి చేసే బాధ్యత భాజపాదే. కేసీఆర్‌కు ఎత్తిపోతల ప్రాజెక్టులంటేనే ఇష్టం. కేసీఆర్‌ ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరు ఇస్తానన్నారు. ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరు ఇచ్చారా..? ఒకసారి వరి వద్దంటారు, ఒకసారి పత్తి వద్దంటారు. తుగ్లక్‌ నిర్ణయాలతో రాష్ట్రాన్ని కేసీఆర్​ భ్రష్టు పట్టించారు. భాజపా అధికారంలోకి వస్తే పెట్రోల్‌ డీజిల్‌పై వ్యాట్ తగ్గిస్తాం. భాజపా అధికారంలోకి వస్తే పెట్రోల్‌, డీజిల్ ధరలు తగ్గిస్తాం. ఒక్క అవకాశం ఇవ్వండి. కాంగ్రెస్​కు అవకాశమిచ్చారు. తెరాసకు ఇచ్చారు. ఇప్పుడు ఒక్క అవకాశం భాజపాకు ఇవ్వండి. ప్లీజ్​.. ప్లీజ్​.. ప్లీజ్​.." - బండి సంజయ్​, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ఇవీ చూడండి:

Last Updated : May 14, 2022, 9:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.