ETV Bharat / city

ఎల్​ఆర్​ఎస్​ ఒక నల్ల చట్టం.. వెంటనే రద్దు చేయాలి: బండి సంజయ్ - ఎల్​ఆర్​ఎస్​ పథకం రద్దకు బండి సంజయ్​ డిమాండ్​

ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్​ఆర్​ఎస్​ పథకంపై... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ మండి పడ్డారు. సంపన్నులకు లాభాం చేసేందుకు... సామాన్యుల నడ్డి విరుస్తుందని విమర్శించారు. దీనిని ఓ నల్ల చట్టంమని ఆయన అభిప్రాయం పడ్డారు.

ఎల్​ఆర్​ఎస్​ ఒక నల్ల చట్టం.. వెంటనే రద్దు చేయాలి: బండి సంజయ్

author img

By

Published : Sep 7, 2020, 5:16 AM IST

తెరాస ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్​ఆర్​ఎస్​ పథకం నిస్సందేహంగా ఓ నల్ల చట్టమని, తక్షణమే రద్దు చేయాలని... భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో... ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాగ్రహానికి గురికావడం ఖాయమన్నారు. సమాజంలో ఉన్న రెండు శాతం సంపన్నులకు ఇది వరమైనప్పటికీ... మిగిలిన 98 శాతం ఆర్థికంగా బలహీన వర్గాల వారికి... శాపమన్నారు. 80 గజాలలోపు నివాస స్థలం ఉన్న నిరుపేదలకు కూడా వర్తింపజేయడం సర్కార్ అనాలోచిత విధానాలకు నిదర్శనమన్నారు.

ప్రభుత్వం నడపలేని ప్రస్తుత స్థితిని అధిగమించేందుకు... పేదలు, మధ్య తరగతి ప్రజలపై ఎల్​ఆర్​ఎస్​ పథకాన్ని బలవంతంగా రుద్దుతుందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఈ విధానంలో... ఒక గజం నుంచి 100 గజాల స్థలం వరకు... గజానికి 200 రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నారన్న బండి సంజయ్... పేదలు కష్టపడి ఒక ఫ్లాట్ కొనుక్కుంటే దానిపై అక్రమ మార్గంలో డబ్బులు వసూలు చేయడం వల్ల... వారిపై పెను భారం పడుతుందన్నారు. దుబారా, అవినీతితో మిగులు రాష్ట్రాన్ని దివాళా తీయించిన కేసీఆర్​... ఎల్​ఆర్​ఎస్​ పేరు చెప్పి సామాన్యుల నడ్డి విరుస్తున్నారని ధ్వజమెత్తారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.