భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రేపు ఉదయం 11 గంటలకు దిల్లీ వెళ్లనున్నారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉంది.
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలను నేతలకు వివరించనున్నట్టు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి వచ్చిన కేంద్ర మంత్రులు ప్రకాష్ జావడేకర్, స్మృతి ఇరానీ సహా పలువురి కలిసి కృతజ్ఞతలు తెలపనున్నట్టు సమాచారం.
ఇదీ చూడండి: భాజపా కీలక సమావేశం.. కార్పొరేటర్లకు దిశానిర్దేశం