ETV Bharat / city

'రఘునందన్​పై కేసు పెట్టడం సిగ్గుచేటు.. ఇది ప్రభుత్వ చేతకానితనమే' - Case registered on MLA Raghunandan Rao

Bandi Sanjay Comments: ఎమ్మెల్యే రఘునందన్​రావుపై కేసు నమోదు చేయటాన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ తీవ్రంగా ఖండించారు. భాజపా నాయకులు, కార్యకర్తలపై కేసు పెట్టేందుకు చూపుతున్న ఆసక్తి.. దోషులను అరెస్ట్ చేయడం పట్ల చూపితే ఇప్పటికి న్యాయం జరిగేదని హితవు పలికారు.

Bjp state president bandi sanjay condemned raghunandhan rao arrest

author img

By

Published : Jun 7, 2022, 3:53 PM IST

Bandi Sanjay Comments: జూబ్లీహిల్స్‌ అత్యాచార ఘటనలో నిందితులపై కేసు నమోదు చేయని పోలీసులు.. న్యాయం చేయాలని ఉద్యమిస్తున్న ఎమ్మెల్యే రఘునందన్‌పై కేసు పెట్టడం సిగ్గుచేటని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ మండిపడ్డారు. అత్యాచార ఘటనలో ఆధారాలు ఉన్నా.. దోషులను అరెస్టు చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరాస, మజ్లిస్‌ నేతల ప్రమేయం ఉన్నందునే కేసును ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని సంజయ్‌ ఆరోపించారు.

ఈ తరహా ఘటనలు రోజుకోకటి వెలుగు చూడటం.. హైదరాబాద్​లో శాంతిభద్రతలు క్షీణించాయనడానికి నిదర్శనమని బండి సంజయ్​ ఆక్షేపించారు. నేరాలను అరికట్టడంలో తామే నంబర్‌ వన్‌ అంటూ గొప్పలు చెప్పుకునే సీఎం కేసీఆర్, కేటీఆర్​ గొంతు ఎందుకు మూగబోయిందని ప్రశ్నించారు. ఈ ఘటనలపై స్పందించరా? అని నిలదీశారు. ప్రభుత్వం చేసే తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని.. అసలైన దోషులను శిక్షించే వరకు భాజపా ఉద్యమిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు.

"గ్యాంగ్​రేప్​ కేసులో నిందితులపై కేసులు నమోదు చేయని పోలీసులు... న్యాయం చేయాలంటూ ఉద్యమిస్తున్న భాజపా నాయకులు, కార్యకర్తలతో పాటు ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసులు పెట్టడం సిగ్గుచేటు. ఈ అత్యాచార ఘటనలో ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్నా దోషులను అరెస్ట్ చేయడంలో ఎందుకింత నిర్లక్ష్యం? భాజపా నాయకులు, కార్యకర్తలపై కేసు పెట్టేందుకు చూపుతున్న ఆసక్తి.. దోషులను అరెస్ట్ చేయడపట్ల చూపితే ఇప్పటికి న్యాయం జరిగేది. తెరాస, మజ్లిస్ నేతల ప్రమేయం ఉన్నందునే కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు. రోజుకో రేప్​ కేసు బయటపడుతుందంటే.. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా లోపించాయని తెలిసిపోతుంది. ఇది ముమ్మాటికి తెరాస ప్రభుత్వ చేతకానితనమే." - బండి సంజయ్​, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.