ETV Bharat / city

BJP: 24 నుంచి సంజయ్ పాదయాత్ర.. ఓల్డ్​సిటీ నుంచే ప్రారంభం

ఈనెల 24 నుంచి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి హైదరాబాద్​లో బండి సంజయ్ పాదయాత్రపై సన్నాహక సమావేశం జరిగింది.

bandi sanjay
బండి సంజయ్
author img

By

Published : Aug 7, 2021, 12:50 PM IST

Updated : Aug 7, 2021, 2:21 PM IST

హైదరాబాద్​ బర్కత్‌పురాలోని భాజపా నగర కార్యాలయంలో హైదరాబాద్ సెంట్రల్‌ జిల్లా అధ్యక్షుడు గౌతమ్‌రావు అధ్యక్షతన ఆ పార్టీ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బండి సంజయ్, గ్రేటర్ హైదరాబాద్‌ పార్టీ నేతలు హాజరయ్యారు. సమావేశ వివరాలను ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌కుమార్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్ర అన్ని నియోజకవర్గాల్లో 250 రోజులకు పైగా కొనసాగుతుందని తెలిపారు. కేసీఆర్‌ కుటుంబపాలనను తరిమి కొట్టేందుకే ఈ పాదయాత్ర చేపట్టినట్లు అయన స్పష్టం చేశారు. పాదయాత్ర నిర్వహణ కోసం 30విభాగాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈనెల 24న బండి సంజయ్‌ ఆధ్వర్యంలో పాతబస్తీ భాగ్యలక్ష్మీ ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

అప్పుల రాష్ట్రంగా మార్చారు

పాదయాత్ర నిర్వహణ కోసం ఇంచార్జీగా గంగిడి మనోహర్ రెడ్డిని, సహా ఇంచార్జీలుగా తూళ్ల వీరేందర్ గౌడ్‌, లంకల దీపక్‌ రెడ్డి, శంకర్‌ను నియమించినట్లు తెలిపారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా మారుస్తామని కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని మనోహర్ రెడ్డి ఆరోపించారు. లక్షల కోట్లు కేసీఆర్ కుటుంబం దోచుకుంటుందన్నారు. తెరాస ప్రభుత్వం చేపట్టే ప్రతి పనిలో అవినీతి నెలకొందని విమర్శించారు. 2013లో రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు సలహాలు తీసుకోని 2023 మేనిఫెస్టో రూపకల్పన చేస్తామని తూళ్ల వీరేందర్ గౌడ్‌ పేర్కొన్నారు. యువత మహిళలు వృద్దులు రైతులకు పాదయాత్ర ద్వారా ధైర్యం ఇస్తామని వీరేందర్ గౌడ్‌ తెలిపారు.

పాదయాత్ర వాయిదా

మొదటగా ఆగస్టు 9 నుంచి బండి సంజయ్​ పాదయాత్ర నిర్వహించాలనుకున్నారు. ఆగస్టు 13 వరకు పార్లమెంటు సమావేశాలు ఉండటం, కీలకమైన బిల్లులు సభ ముందుకు రానున్న దృష్ట్యా.. పాదయాత్ర వాయిదా వేశారు. పాదయాత్ర ప్రారంభం నాడు కీలక జాతీయనేత లేదా ముఖ్యమైన కేంద్ర మంత్రిని ఆహ్వానించాలని నిర్ణయించినట్లు సమాచారం.

ఇదీ చదవండి: ఈ ఏడైనా వినాయక తయారీదారులకు విఘ్నాలు తొలగేనా..?

Last Updated : Aug 7, 2021, 2:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.