ETV Bharat / city

బాబ్రీ తీర్పు: వారు మత రాజకీయాలు మానుకుంటే మంచిది: లక్ష్మణ్​

author img

By

Published : Sep 30, 2020, 5:15 PM IST

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా నిర్దోషులుగా తేలుస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్​ తెలిపారు. ఈ తీర్పుతో భారతీయ జనతా పార్టీ వాదన నిజమైందని స్పష్టం చేశారు. ఇతరుల మత విశ్వాసాలను దెబ్బతీసేందుకు ఎప్పుడూ ప్రయత్నించలేదన్నారు.

bjp laxman
బాబ్రీ తీర్పు: వారు మత రాజకీయాలు మానుకుంటే మంచిది: లక్ష్మణ్​

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్​ హర్షం వ్యక్తం చేశారు. ఈ కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా నిర్దోషులుగా తేలుస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు తెలిపారు.

ఇందులో ఏ విధమైన కుట్ర లేదని.. ఉద్దేశపూర్వకంగా జరగలేదని స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగిందన్నారు. భారతీయ జనతా పార్టీ వాదన నిజమైందని స్పష్టం చేశారు. ఇన్నాళ్లు బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనపై కాంగ్రెస్ సహా పలు రాజకీయ పక్షాలు భాజపాపై చేస్తున్న ఆరోపణలు తప్పని తాజా తీర్పుతో రుజువైందన్నారు. ఇప్పటికైనా వారంతా.. మత రాజకీయాలు మానుకుంటే బాగుంటుందని హితవు పలికారు.

భారత సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది హిందువుల ఆకాంక్ష మేరకు అయోధ్య రామజన్మ భూమిలో శ్రీరాముడి మందిరం నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇతరుల మత విశ్వాసాలను దెబ్బతీసేందుకు ఎప్పుడూ ప్రయత్నించలేదని స్పష్టం చేశారు.

ఇవీచూడండి: 'బాబ్రీ కేసులో నిందితులు అందరూ నిర్దోషులే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.