గ్రామీణ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పరిచేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయత్నిస్తుంటే... దేశ వ్యాప్తంగా అన్ని విపక్ష పార్టీలు భారత్‌బంద్‌లో పాల్గొన్నాయని భాజపా సీనియర్ నేత మురళీధర్ రావు మండిపడ్డారు. తెలంగాణలో ఆరు నిర్ణయాలతో వ్యవసాయ రంగం విధ్వంసం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రెగ్యులేటరీ వ్యవసాయ పాలసీతో రైతులను నాశనం చేస్తోందని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజనలో కేంద్రానికి సహాకరించకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని మురళీధర్ అన్నారు. గోవధ విషయంలో కర్ణాటక ప్రభుత్వం ప్రస్తుత చట్టాలను మార్చి కొత్త పాలసీలను తీసుకువచ్చిందని... ఆ తరహాలో తెలంగాణలో కూడా చట్టాలు రావాలన్నారు. డీజీపీ, హైదరాబాద్ సీపీ చట్టానికి దాసులని... తెరాసకు కాదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వ్యవసాయరంగ సమస్యలపై రైతులతో కలిసి ప్రగతిభవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: పార్లమెంట్ కొత్త భవనం భూమిపూజకు సర్వం సిద్ధం