ETV Bharat / city

భాజపా రాష్ట్ర నాయకత్వంపై రాములమ్మ అసంతృప్తి రాగం

Vijayashanthi Comments రాష్ట్రంలో ప్రధాన పార్టీల్లో అసంతృప్తి రాగాల హవా నడుస్తోంది. కాంగ్రెస్​లో ఈ తరహా స్వరాలు చాలా రోజుల నుంచి గట్టిగానే వినబడుతుండగా ఇటీవలి కాలంలో రసవత్తరంగా మారిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు భాజపా వంతు కూడా వచ్చింది. ఉద్యమకారిణిగా ఉన్న తన గొంతు నొక్కేస్తున్నారంటూ రాములమ్మ అసంతృప్తి రాగం అందుకుంది.

BJP National Executive Committee member Vijayashanthi sensational comments on state leadership

author img

By

Published : Aug 18, 2022, 3:15 PM IST

Updated : Aug 18, 2022, 5:34 PM IST

Vijayashanthi Comments: భాజపా రాష్ట్ర నాయకత్వంపై మాజీ ఎంపీ, ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి అసంతృప్తి వ్యక్తం చేశారు. సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో పాల్గొన్న అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర నాయకత్వం తనను నిశ్శబ్దంలో ఉంచిందని అవేదన వ్యక్తం చేశారు. పార్టీలో మాట్లాడటానికి అవకాశం ఎందుకివ్వడంలేదో పార్టీ నేతలనే అడగాలని మీడియా ప్రతినిధులకు తెలిపారు. అంతేకాకుండా అసంతృప్తిగా ఉన్నానో లేనో పార్టీ నేతల వద్ద స్పష్టత తీసుకోవాలని సూచించారు. తన సేవలను ఏ విధంగా ఉపయోగించుకుంటారో బండి సంజయ్‌, లక్ష్మణ్​కే తెలియాలని వ్యాఖ్యానించారు. తానెక్కడి నుంచి పోటీ చేయాలనేది పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు.

"నేను అసంతృప్తిగా ఉన్నానో లేదో పార్టీ నేతల వద్ద స్పష్టత తీసుకోండి. సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా మాట్లాడదామనుకున్నా. లక్ష్మణ్‌ వచ్చి మాట్లాడారు.. వెళ్లిపోయారు.. నాకేమీ అర్థం కాలేదు. నా సేవలను ఎలా ఉపయోగించుకుంటారో బండి సంజయ్‌, లక్ష్మణ్‌కే తెలియాలి. పార్టీ బాధ్యతలు ఇచ్చినపుడే ఏమైనా చేయగలం. ఇవ్వకుండా చేయమంటే ఏం చేయగలం? నా పాత్ర ఎప్పుడూ టాప్‌ పాత్రే. రాములమ్మ ఎప్పుడూ రాములమ్మ పాత్రే. ఉద్యమకారిణిగా అందరి హృదయాల్లో ఉన్నాను. పార్లమెంట్‌లో కొట్లాడిన మనిషిని. నా పాత్ర ఎప్పుడూ బాగానే ఉంటుంది. పాత్ర లేకుండా చేయాలనుకునే వాళ్లను పాతరేస్తే బెటర్‌గా ఉంటుంది." - విజయశాంతి, భాజపా జాతీయ కార్యవర్గ సభ్యురాలు

భాజపా రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తి రాగం అందుకున్న రాములమ్మ

ఇవీ చూడండి:

Last Updated : Aug 18, 2022, 5:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.