Laxman on CM Kcr BRS: మునుగోడు ఉపఎన్నికలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తారని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. ముఖ్యమంత్రికి దమ్ముంటే భారాస పార్టీ పేరుతో మునుగోడు ఎన్నికల్లో గెలిచి చూపించాలని తెలిపారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో భాజపా ఏర్పాటు చేసిన ఓబీసీ మోర్చా 3 రోజుల ప్రత్యేక శిబిరానికి ఎంపీ ముఖ్యఅతిథిగా హజరయ్యారు. ఉద్యమకారులను మొదట నుంచి మోసం చేస్తూ వచ్చిన ప్రభుత్వం.. బీసీలకు సముచిత స్థానం కల్పించలేదని ఆరోపించారు.
కాంగ్రెస్, తెరాస రెండు పార్టీలూ బీసీలను మోసం చేశాయని.. పీఎం నరేంద్ర మోదీ వారికి సముచితం స్థానం ఇచ్చి ఉన్నత పదవులతోపాటు రిజర్వేషన్లు కల్పించారని లక్ష్మణ్ పేర్కొన్నారు. 8 ఏండ్ల పాలనలో తెలంగాణ ప్రజలకు కేసీఆర్ చేసింది ఏంటో ముందు చెప్పాలని ప్రశ్నించారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పులు పాలు చేశారని ఆయన ఆరోపించారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు సీఎం కేసీఆర్ పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలోచ్చినా భాజపాదే విజయమని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని కోరారు.
ఇవీ చదవండి: