భాజపా ఆధ్వర్యంలో చేపట్టనున్న ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతి ఇవ్వాలని ఆ పార్టీ నేతలు డీజీపీ మహేందర్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ నెల 24న చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం నుంచి యాత్ర ప్రారంభం అవుతుందని... సెప్టెంబరు 6 వరకు కొనసాగుతుందని భాజపా ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి ప్రకటించారు. పాదయాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు డీజీపీకి ఇచ్చామని తెలిపారు.
పాద యాత్రకు పోలీస్ శాఖ తరఫున పూర్తి సహాయ సహకారాలు ఇస్తామని డీజీపీ హామీ ఇచ్చారని తెలిపారు. మరోవైపు మల్కాజిగిరి ఘటనపై మాజీ ఎంఎల్‌సీ రాంచదర్‌రావు తీవ్రంగ ఖండించారు. మైనంపల్లి హనుమంతరావు... భాజపా కార్పొరేటర్‌పై దాడి చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. పోలీసులు ఎమ్యెల్యేకి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ ఘటనలో ఏమ్మెల్యేను ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. ఈ ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేశామని తెలిపారు.
ఈనెల 24 నుంచి భాజపా చేపట్టబోయే ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతి కోసం డీజీపీకి విజ్ఞప్తి చేశాము. యాత్రకు సంబంధించి పూర్తి వివరాలు అందించాము. మొదటి దశలో 40 రోజుల పాటు పాదయాద్ర సాగుతుంది. ఈ యాత్రను భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద భాజపా జాతీయ నాయకులు ప్రారంభిస్తారు. యాత్ర పూర్తిగా ప్రజాస్వామ్య హితంగా సాగుతుంది. మా విజ్ఞప్తిపై డీజీపీ సానుకూలంగా స్పందించారు. ఈ యాత్ర ద్వారా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజలవద్దకు వెళ్లి తెలియజేస్తాం. 2023లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఈ పాదయాత్ర సాగుతుంది. -మనోహర్ రెడ్డి, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు.
ఇదీ చూడండి: Bandi sanjay: దళిత బంధు సభకు మీడియాను ఎందుకు అనుమతించరు.?