ETV Bharat / city

భాజపా నేతల అరెస్టు.. గృహ నిర్బంధం

కరోనా నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి వినతిపత్రం ఇవ్వడానికి బయల్దేరిన భాజపా నాయకుల్లో కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్సీ రామచందర్‌రావు, ఎమ్మెల్యే రాజాసింగ్‌, పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్‌లతో కూడిన బృందం నేరుగా ప్రగతిభవన్‌కు వెళ్లడానికి నిర్ణయం తీసుకుంది. దీంతో శుక్రవారం ప్రగతిభవన్‌ వద్ద భారీగా పోలీసులు మోహరించడంతో పాటు నాయకులను ఎక్కడికక్కడే గృహనిర్బంధంలో ఉంచారు.

భాజపా నేతల అరెస్టు.. గృహ నిర్బంధం
భాజపా నేతల అరెస్టు.. గృహ నిర్బంధం
author img

By

Published : Jun 13, 2020, 6:51 AM IST

కరోనా నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి వినతిపత్రం ఇవ్వడానికి బయల్దేరిన భాజపా నాయకుల్లో కొందరిని పోలీసులు అరెస్టు చేయడంతో పాటు మరికొందరిని గృహ నిర్బంధం చేశారు. వైరస్‌ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో పరిస్థితిని వివరించడానికి భాజపా నాయకులు ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్‌ను కోరారు. అపాయింట్‌మెంట్‌ లభించకపోవడంతో ఎమ్మెల్సీ రామచందర్‌రావు, ఎమ్మెల్యే రాజాసింగ్‌, పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్‌లతో కూడిన బృందం నేరుగా ప్రగతిభవన్‌కు వెళ్లడానికి నిర్ణయం తీసుకుంది. దీంతో శుక్రవారం ప్రగతిభవన్‌ వద్ద భారీగా పోలీసులు మోహరించడంతో పాటు నాయకులను ఎక్కడికక్కడే గృహనిర్బంధంలో ఉంచారు.

అత్యవసర సమస్యలపై చర్చించాలనుకుంటే నిర్బంధాలకు దిగడం కేసీఆర్‌ నియంత వైఖరిని చాటుతోందని లక్ష్మణ్​ విమర్శించారు. తెలంగాణలో ప్రత్యేక రాజ్యాంగం ఏమైనా ఉందా? ఆర్టికల్‌ 370 లాంటిది ఇక్కడేమైనా అమలు జరుగుతోందా అని మండిపడ్డారు. రాజాసింగ్‌ ఒక వీడియో సందేశం విడుదల చేస్తూ.. కొవిడ్‌-19 నివారణ చర్యల్లో విఫలమైన సీఎం కేసీఆర్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రగతిభవన్‌కు బయల్దేరిన ఎమ్మెల్సీ రాంచందర్‌రావును ఓయూ పోలీసులు అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. శాంతియుతంగా వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తున్న వారిని అరెస్టు చేయడం విడ్డూరంగా ఉందని రాంచందర్​రావు అన్నారు. కరోనాను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

సర్కారు తీరు అప్రజాస్వామికం: బండి సంజయ్‌

కరోనా కట్టడి విషయంలో వైఫల్యాల్ని తమ పార్టీ ఎత్తిచూపుతుంటే తెలంగాణ ప్రభుత్వం స్పందించకుండా అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. కరోనా విషయంలో ముఖ్యమంత్రిని కలవడానికి ప్రయత్నించిన పార్టీ నేతల గృహనిర్బంధం, అరెస్ట్‌లను ఖండించారు. విపక్షనేతలు కలుస్తామని కోరితే సీఎం కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదని చెప్పారు. మహమ్మారి నియంత్రణలో ప్రభుత్వం చిత్తశుద్ధిని చూపడం లేదని, హైకోర్టు మొట్టికాయలు వేసినా సర్కారు తీరు మారట్లేదని అన్నారు. వైరస్‌ బాధితుల్ని పరామర్శించేందుకు గవర్నర్‌ ఆసుపత్రులకు వెళ్తుంటే.. సీఎం కేసీఆర్‌ మాత్రం ఇంట్లోనుంచి బయటకు కదలడం లేదని ఆయన తీరును తప్పుబట్టారు. మంత్రి గంగుల కమలాకర్‌ అవినీతి, అక్రమాలను త్వరలోనే బయటపెడతానన్నారు. తనను విమర్శించడం కోసమే ఆయనకు మంత్రి పదవిని కట్టబెట్టారని ఎద్దేవా చేశారు.

ఇవీ చూడండి: పసిపిల్లను పనిపిల్ల చేసి... చిత్రహింసలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.