ETV Bharat / city

కొలువుల లెక్కపై ప్రజలను మోసం చేస్తున్నారు: రాంచందర్​రావు - తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వార్తలు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తెరాస, భాజపా నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొలువుల లెక్కపై చర్చకు రావాలని కేటీఆర్​కు.. హైదరాబాద్​-రంగారెడ్డి- మహబూబ్​నగర్​ పట్టభద్రుల నియోజకవర్గం భాజపా అభ్యర్థి రాంచందర్​రావు సవాల్​ విసిరారు. తాను ఓయూలో ఉన్నాయని.. కేటీఆర్​ చర్చకు రావాలన్నారు. కొంతసేపు వేచిచూసి వెనుదిరిగారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థను భ్రష్టుపట్టించారని రాంచందర్​రావు ఆరోపించారు.

ram chander rao
కొలువుల లెక్కపై ప్రజలను మోసం చేస్తున్నారు: రాంచందర్​రావు
author img

By

Published : Mar 1, 2021, 4:24 PM IST

ఉద్యోగాల కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని హైదరాబాద్​-రంగారెడ్డి-మహబూబ్​నగర్​ పట్టభద్రుల నియోజకవర్గం భాజపా అభ్యర్థి రామచందర్​రావు అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కొలువులు రాక.. సుమారు 100 మంది ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. ఉద్యోగాల లెక్కల విషయంలో తెరాస ప్రభుత్వం అబద్దాలు ప్రచారం చేస్తూ, ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న ఉద్యోగాల లెక్కలపై ఓయూ వేదికగా చర్చకు రావాలని కేటీఆర్​కు.. రాంచందర్​రావు సవాల్​ విసిరారు. ఇవాళ ఓయూ ఆర్ట్స్ కాలేజీ దగ్గర.. కేటీఆర్​ కోసం వేచిచూసి.. ఆయన రాకపోయేసరికి వెనుదిరిగారు.

టీఎస్పీఎస్సీ నుంచి 35 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని రాంచందర్​రావు అన్నారు. 1.32 లక్షల ఉద్యోగాలు భర్తీచేశామని చెబుతున్న వాటిలో కొత్త కొలువులు లేవన్నారు. అందులో కొన్ని.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయన్నారు. విద్యావ్యవస్థను భ్రష్టుపట్టించారని.. విశ్వవిద్యాలయాలను ఖాళీలతోనే నెట్టుకొస్తున్నారని ఆరోపించారు. ప్రైవేటు వర్సిటీల కోసం.. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని డిమాండ్​ చేశారు.

కొలువుల లెక్కపై ప్రజలను మోసం చేస్తున్నారు: రాంచందర్​రావు

ఇవీచూడండి: ఎన్‌డీఏ అంటే నో డేటా అవైల‌బుల్: కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.