ETV Bharat / city

స్వామి వివేకానంద ఆశయాలను కొనసాగించాలి : లక్ష్మణ్​ - telangana varthalu

స్వామి వివేకానంద జయంతి నేపథ్యంలో వివేకానంద చిత్రపటానికి భాజపా ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు లక్ష్మణ్​ నివాళులర్పించారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని సూచించారు.

స్వామి వివేకానంద ఆశయాలను కొనసాగించాలి : లక్ష్మణ్​

author img

By

Published : Jan 12, 2021, 5:28 PM IST

స్వామి వివేకానంద ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలని, ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని భాజపా ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. స్వామి వివేకానంద 158వ జయంతి సందర్భంగా అంబర్ నగర్ కట్ట వద్ద స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

సంక్రాంతి సంబురాలను పురస్కరించుకుని మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 100 మహిళలు పాల్గొని అందమైన రంగవల్లులను ఆవిష్కరించారు. గెలిచిన విజేతలకు లక్ష్మణ్​ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు భాజపా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 'వివేకానందుని రచనలు చదివుంటే బలవన్మరణాలు చేసుకోరు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.