రాష్ట్రంలో కరోనా పరీక్షల ఈ విషయంలో ముఖ్యమంత్రి అనుసరిస్తున్న వైఖరి సమంజసం కాదని భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా గాంధీ ఆసుపత్రి వద్ద నిరసన తెలిపేందుకు తన నివాసం నుంచి గాంధీ ఆసుపత్రికి వెళ్తుండగా... లక్ష్మణ్తోపాటు బీజేవైఎం నగర అధ్యక్షుడు వినయ్ కుమార్, నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వ మొండి వైఖరి వీడే వరకు భాజపా పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
కరోనా నిర్ధరణ పరీక్షల విషయంలో ముఖ్యమంత్రి వైఖరి... అమ్మ పెట్టదు... అడుక్కు తిననివ్వదన్న చందంగా ఉందని లక్ష్మణ్ అన్నారు. పరీక్షలు, చికిత్సలు చేయమని వేడుకుంటున్నా ప్రభుత్వం పెడచెవిన పెట్టడం వల్లనే... ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పారసిటమాల్ వేసుకుంటే సరిపోతుందని సీఎం చెప్పిన విషయాన్ని కేంద్ర మంత్రులు ప్రస్తావిస్తే... రాష్ట్ర మంత్రులు విమర్శలు చేయడం ఎంత వరకు సమంజసమని నిలదీశారు.
ఇదీ చూడండి: 'మోదీజీ.. రాజీ వద్దు- ఐకమత్యంగా ఎదుర్కొందాం'