ప్రజలు కరోనాతో కష్టాలు పడుతుంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరుతో ఖజానా నింపుకోవాలని చూడటం దుర్మార్గమని భాజపా రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. పలుమార్లు రిజిస్ట్రేషన్లు అయిన ప్లాట్లపై ఎల్ఆర్ఎస్ పేరుతో వసూల్లేంటని ఒక ప్రకటనలో బండి సంజయ్ ప్రశ్నించారు.
కొత్త పన్నులు సృష్టించడంలో సీఎం కేసీఆర్ నిజాంను మించిపోయారని మండిపడ్డారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎల్‌ఆర్ఎస్ రద్దు చెయ్యకపోతే తెరాసకు ప్రజలు వీఆర్‌ఎస్ ఇస్తారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ రద్దు చేయకపోతే ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.