గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా భాజపా సిద్ధంగా ఉందని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.లక్ష్మణ్ తెలిపారు. గ్రేటర్‌లోనూ దుబ్బాక ఉపఎన్నిక ఫలితాలే వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. బిహార్‌తో పాటు పలు రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికల్లో భాజపా జయకేతనం ఎగురవేసిందని పేర్కొన్నారు.
హైదరాబాద్ ప్రజలను తెరాస ప్రభుత్వం మోసం చేస్తోందని లక్ష్మణ్ ఆరోపించారు. లక్ష రెండు పడక గదుల ఇళ్లు నిర్మించామని చెబుతున్న తెరాస ప్రభుత్వం కేవలం 450 ఇళ్లనే పూర్తిచేసిందని ఆక్షేపించారు. గ్రేటర్ ఎన్నికల దృష్టితోనే తెరాస ప్రభుత్వం వరాలు ప్రకటిస్తోందని విమర్శించారు. నగరంలో వరద బాధితులకు సాయం అందించటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగ విఫలమైందని లక్ష్మణ్ తెలిపారు.